»Plan To Control Delhi Pollution Kick In Day After Air Quality Turns Poor
Pollution Control: కాలుష్యం కంట్రోల్ చేయడానికి ఢిల్లీ ప్రభుత్వం చర్యలు షురూ!
ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరాల్లో ఢిల్లీ(Delhi) కూడా ఒకటి. దేశ రాజధానిలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. దీంతో వాయు కాలుష్యాన్ని ఎదుర్కొవడానికి తన కార్యాచరణ ప్రణాళికను ఈరోజు ప్రారంభించింది. ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో కూడా 300 కంటే ఎక్కువ AQI నమోదైంది. ఇది 'తీవ్రమైనది'గా అధికారులు వర్గీకరించారు.
Plan To Control Delhi Pollution Kick In Day After Air Quality Turns Poor
చలి కాలంలో ఢిల్లీ(Delhi)లో వాయు కాలుష్యాన్ని తనిఖీ చేసేందుకు కేంద్రం రూపొందించిన గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ (GRAP) మొదటి దశ ఈరోజు అమలులోకి వచ్చింది. కాలుష్యం కలిగించే వాహనాలకు ఇప్పుడు భారీ జరిమానా విధించారు. అయితే జాతీయ రాజధానికి వెళ్లని ట్రక్కులు తూర్పు, పశ్చిమ పెరిఫెరల్స్ ద్వారా మళ్లీంచారు. దుమ్ము నివారణ చర్యల రిమోట్ మానిటరింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్లో నమోదు చేయని 500 చదరపు మీటర్లకు సమానమైన లేదా మించిన ప్లాట్ సైజుతో ప్రైవేట్ నిర్మాణ, కూల్చివేత ప్రాజెక్టుల పనిని స్టేజ్ 1 తప్పనిసరి చేసింది. నిర్మాణ, కూల్చివేత ప్రదేశాలలో యాంటీ స్మోగ్ గన్లు ఉపయోగించారు.
మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్లు, బహిరంగ తినుబండారాల వద్ద తాండూర్లలో బొగ్గు, కట్టెల వాడకంపై పూర్తి నిషేధాన్ని కూడా అధికారులు అమలు చేస్తున్నారు. దహన కార్యకలాపాలను నిషేధించాలని అనుకుంటున్నారు. ప్రతి ఏడాది జాతీయ రాజధాని శీతాకాలంలో కంటికి కనిపించే పొగమంచు, తీవ్రమైన విషపూరితమైన గాలితో పోరాడుతుంది. పొరుగు రాష్ట్రాల్లో పంట అవశేషాలను కాల్చడం, దీపావళి సమయంలో పటాకుల నుంచి వెలువడే ఉద్గారాలు పరిస్థితిని మరింత దిగజార్చడం వల్ల ఇది ప్రధానంగా పెరుగుతుందని స్థానికులతోపాటు అధికారులు కూడా అంటున్నారు. అనేక మంది పటాకులు కాల్చకూడదని చెప్పినా కూడా పాటించడం లేదని పలువురు అంటున్నారు. ఇప్పటికే దేశ రాజధాని పరిధిలో కాలుష్యం(Pollution) పట్ల కఠిన నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు.