»415 Million Less Poor In India In Last 15 Years Uno Said
India:లో గత 15 ఏళ్లలో 415 మిలియన్లు తగ్గిన పేదలు
భారతదేశం(india) పేదరికంలో గణనీయమైన తగ్గింపు నమోదనట్లు ప్రముఖ సంస్థ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్(UNDP) వెల్లడించింది. కేవలం 15 ఏళ్లలో 415 మిలియన్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపింది.
ఇండియా(india)లో పేదరికం పెద్ద ఎత్తున తగ్గినట్లు అగ్ర సంస్థ యూఎన్ఓ తెలిపింది. 2005/2006 నుంచి 2019/2021 వరకు 15 సంవత్సరాలలో మొత్తం 415 మిలియన్ల మంది పేదరికం(poor) నుంచి బయటపడ్డారని UNDP పేర్కొంది. అయితే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన భారత్ సాధించిన అద్భుతమైన విజయమని UN అభిప్రాయం వ్యక్తం చేసింది. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ (UNDP), ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలోని ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ (OPHI) ఆధ్వర్యంలోని గ్లోబల్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ (MPI) నివేదికను విడుదల చేసింది. భారత్తో సహా 25 దేశాలు తమ గ్లోబల్ MPI విలువలను 15 ఏళ్లలో విజయవంతంగా సగానికి తగ్గించుకున్నాయని తెలిపింది. ఈ దేశాల్లో కంబోడియా, చైనా, కాంగో, హోండురాస్, ఇండియా, ఇండోనేషియా, మొరాకో, సెర్బియా, వియత్నాం ఉన్నాయి.
మరోవైపు చైనా(china) (2010–14లో 69 మిలియన్లు), ఇండోనేషియా (2012–17, 8 మిలియన్లు)లో పెద్ద సంఖ్యలో ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని పేర్కొంది. అంతకుముందు ఏప్రిల్లో UN డేటా ప్రకారం భారతదేశం 142.86 కోట్ల మందితో ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను అధిగమించింది. ఇండియాలో 2005/2006 నుంచి 2019/2021 వరకు 415 మిలియన్ల మంది పేదలు పేదరికం నుంచి బయటపడగా.. 2005/2006లో 55.1 శాతం ఉన్న పేదరికం 2019/2021 నాటికి 16.4 శాతానికి తగ్గింది. 2005/2006లో భారతదేశంలో దాదాపు 645 మిలియన్ల మంది పేదరికంలో ఉన్నారు. ఈ సంఖ్య 2015/2016లో దాదాపు 370 మిలియన్లకు, 2019/2021లో 230 మిలియన్లకు చేరింది. ఇండియాలో 2005/2006లో 44.3 శాతంగా ఉన్న పేదలు, పౌష్టికాహారం లేని వ్యక్తులు 2019/2021 నాటికి 11.8 శాతానికి తగ్గారు. ఈ నేపథ్యంలో పిల్లల మరణాలు 4.5 శాతం నుంచి 1.5 శాతానికి తగ్గారని ప్రకటించారు.