వచ్చే సంక్రాంతికి వీరసింహారెడ్డిగా రాబోతున్నారు నందమూరి నటసింహం బాలకృష్ణ. గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పై భారీ అంచనాలున్నాయి. అయితే బాలయ్య దూకుడు ఒక్క థియేటర్లోనే కాదు.. డిజిటల్ ఫ్లాట్ ఫామ్లోను దుమ్ముదులుపుతున్నారు. ఆహా ఓటిటిలో వస్తున్న’అన్ స్టాపబుల్’ టాక్ షో.. బాలయ్య హోస్టింగ్‌తో నెక్స్ట్ లెవల్‌కి వెళ్లిపోయింది. ప్రస్తుతం సెకండ్ సీజన్ అంతకు మించి అనేలా సాగుతోంది. ఇక ఈ టాక్ షోకు బాలయ్య దాదాపు 10 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్టు గతంలో వార్తలొచ్చాయి. ఇక ఇప్పుడు మరో షో కోసం కూడా బాలయ్య అంతే మొత్తంలో డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అసలు ఈ సారి బిగ్ బాస్ సీజన్ 6 ఎంత చప్పగా సాగిందో అందరికీ తెలిసిందే. ఈ సీజన్ కంటెస్టెంట్స్ కూడా ఎవరనేది తెలియకుండా సాగిపోయింది. అలాగే నాగార్జున హోస్టింగ్ పై విమర్శలొచ్చాయి. ఈ నేపథ్యంలో నెక్స్ట్ సీజన్ ఉంటుందా.. ఉంటే నాగ్‌నే హోస్ట్ చేస్తారా అనే డౌట్స్ వస్తున్నాయి. కానీ నాగ్ బిగ్ బాస్ నుంచి తప్పుకున్నట్టే తెలుస్తోంది. దాంతో ఇప్పుడు బాలకృష్ణ రేసులోకి వచ్చేశారు. ‘ఆహా’ ఓటిటికి ఊహించని క్రేజ్ తీసుకొచ్చిన బాలయ్యతో.. బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ ప్లాన్ చేస్తున్నారట. బాలయ్య కూడా అందుకు ఓకే చెప్పేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో.. బాలయ్య 10 కోట్లకి పైగా రెమ్యునరేషన్ ఛార్జ్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు అది ఇంకాస్త ఎక్కువే ఉండొచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే అసలు బాలయ్య బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెడతారా.. లేదా.. అనేది ఇప్పుడే చెప్పలేం.