Arjun: సూపర్ స్టార్ రజినీకాంత్ ( Rajinikanth) సినిమా అంటే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతూ ఉంటారు. ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. కొత్త సినిమా డేట్ ప్రకటించిన దగ్గర నుంచి రిలీజ్ అయ్యేవరకు ఫ్యాన్స్ తెగ హడావిడి చేస్తూ ఉంటారు. తాజాగా ఆయన మూవీకి సంబంధించి ఓ అప్ డేట్ వచ్చింది.
రజినీకాంత్ ( Rajinikanth) తాజా మూవీకి విలన్ దొరికేశాడు. యాక్షన్ హీరో అర్జున్ (Arjun) ఎంపిక చేశారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ ( Rajinikanth) ఓ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ రజనీకాంత్ చివరి చిత్రం అని తరువాత అతను సినిమాల నుండి రిటైర్ అయ్యి హిమాలయాల్లో గడుపుతాడని అందరికీ షాక్ ఇచ్చాడు కోలీవుడ్ దర్శకుడు మైస్కీన్. రజనీకాంత్‌తో ( Rajinikanth) తలపడేందుకు అర్జున్‌ని విలన్‌గా తీసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు ఎక్సైటింగ్ రిపోర్ట్స్ వస్తున్నాయి.
అర్జున్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో దళపతి విజయ్ హీరోగా తెరకెక్కుతున్న LEO సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు రానున్నాయి. రజనీకాంత్ ప్రస్తుతం జైలర్, అతని కుమార్తె ఐశ్వర్య ప్రాజెక్ట్ లాల్ సలామ్‌తో బిజీగా ఉన్నారు.