»Writer Sarath Chandra Exclusive Interview Mahesh Babu Srimanthudu Jr Ntr
Writer Sarath Chandra: కొరటాల శివను ఇండస్ట్రీ నుంచి తరిమి కొట్టేంత వరకు వదలను
మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన శ్రీమంతుడు సినిమా కథ తనదే అంటూ సుప్రింకోర్డువరకు వెళ్లిన రచయిత శరత్ చంద్ర హిట్ టీవీ ప్రేక్షకుల కోసం ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు. ఆయన జీవితం గురించి, శ్రీమంతుడు కథ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
Writer Sarath Chandra Exclusive Interview Mahesh Babu Srimanthudu Jr NTR
Writer Sarath Chandra: శ్రీమంతుడు సినిమా విషయంలో తనకు జరిగింది అన్యాయం అని రచయిత శరత్ చంద్ర తెలిపారు. కథ తనదే అని ఛాంబర్ పెద్దలతో మాట్లాడుతున్నప్పుడు రూ. 100 కోట్లు ఇచ్చినా తాను వెనక్కి తగ్గను అని చెప్పినట్లు తెలిపారు. వాళ్ల నాన్న ఒక కానిస్టేబుల్ అని నీజాయితీ వాళ్ల ఆస్తి అని తెలిపారు. ధర్మం కోసం మనం ఫైట్ చేస్తున్నప్పుడు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని వెల్లడించారు. సత్యం చెప్పినంత వరకు మన వాయిస్ గంభీర్యంగా ఉంటుంది అని పేర్కొన్నారు. మొదటినుంచి విద్యార్థి నాయకుడిగా ఉన్నట్లు, తరువాత జర్నలిస్టుగా పనిచేసినట్లు వెల్లడించారు. చచ్చెేంత ప్రేమ పేరుతో స్వాతి బుక్ లో అచ్చు అయినట్లు తెలిపారు. తరువాత కొన్నాళ్లకు శ్రీమంతుడు సినిమా వచ్చినట్లు తెలిపారు. సినిమా చూసి షాక్ అయినట్లు పేర్కొన్నారు. చిత్రం పూర్తిగా తన నవల ఆధారంగా తీసినట్లు తెలుసుకున్నారు, దేవరకోట, కథా ప్రాంతం అన్ని కాపీనే అని తెలిసింది. ఆ తరువాత జరిగిన పరిణామాలను ఎంతో ఆసక్తిగా వివరించారు. ఇప్పటి అది కోర్టులో కేసు నడుస్తుంది. చిరంజీవిని దృష్టిలో పెట్టుకుని ఓ అద్భుతమైన కథను రాసినట్లు తెలిపారు. ఇలాంటి ఎన్నో విషయాలను హిట్ టీవీతో పంచుకున్నారు. వీటి గురించి తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి.