»Razakar Movie Director Yata Satyanarayana Exclusive Interview Hittvtelugu
Razakar: రజాకార్ మూవీ గురించి సంచలన విషయాలు చెప్పిన డైరెక్టర్
తెలంగాణలో జరిగిన హింసాత్మక చరిత్రను రజాకార్ అనే చిత్రం ద్వారా చూపించే ప్రయత్నిస్తే రాజకీయ రంగు పులుముతున్నారని డైరెక్టర్ యాట సత్యనారాయణ అన్నారు. సినిమా గురించి, దానిపై వస్తున్న విమర్షల గురించి హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు.
Razakar Movie Director Yata Satyanarayana Exclusive Interview Hittvtelugu
Razakar: నిజాం పాలనలో తెలంగాణ ఉన్నప్పుడు రజాకార్(Razakar ) పేరుతో జరిగినా అరాచకాల నేపథ్యంలో తెరకెక్కిన తాజా సినిమా రజాకార్ (Razakar ). ఈ చిత్ర దర్శకుడు యాట సత్యనారాయణ(Yata Satyanarayana) హిట్ టీవీ ప్రేక్షకులతో సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమా నుంచి విడుదలైన మోషన్ పోస్టర్లో బ్రాహ్మణ పిల్లవాడి నుంచి మొదలు పెడితే తాజాగా రిలీజ్ అయిన టీజర్ వరకు ప్రతి విషయంలో ఎందుకు వివాదస్పదం అవుతుందో తెలిపారు. తెలంగాణ చారిత్రక నేపథ్యంలో సినిమా అంటే చరిత్రనే చూపించాలి అని ఇది ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ కాదు, వ్యతిరేకం కాదన్నారు. ఈ చిత్ర నిర్మాత గూడురూ నారయాణ రెడ్డి(Guduru Narayana Reddy) బీజేపీకి చెందిన వ్యక్తి అయినప్పటికీ.. ఆయనకు ఎలాంటి దురుద్దేశం లేదని.. ఇది చరిత్రలాగే చూశారని అన్నారు. సినిమా పోస్టర్లో, టీజర్లలో ఇలా ఉన్నా, చిత్రం మొత్తం చూస్తే ప్రేక్షకులకే అర్థం అవుతుందని అంటున్నారు.