»Music Director Amrish Exclusive Interview With Suresh Kondeti Actress Jayachitra Son
Music Director Amrish: సమ్మోహనుడా సాంగ్ వైరల్ అవడానికి కారణమిదే?
సీనియర్ నటి జయచిత్ర తనయుడు మ్యూజిక్ డైరెక్టర్ అమ్రిష్ గణేష్ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను హిట్ టీవీ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాజాగా రూల్స్ రంజన్ చిత్రంలోని సమ్మోహనుడా సాంగ్ అంత వైరల్ అవడానికి ముఖ్య కారణం ఏంటో కూడా వివరంగా తెలిపారు.
Music Director Amrish Exclusive Interview With Suresh Kondeti Actress Jayachitra Son
Music Director Amrish: బాలనటుడిగా కొన్ని సినిమాలు చేసి, తరువాత హీరోగా ట్రై చేద్దామని ఒక సినిమా చేసి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్‌గా తెలుగు ప్రేక్షకులు దగ్గరయ్యాను అని అమ్రిష్ గణేష్(Amrish) పేర్కొన్నారు. ఇక బాలకృష్ణ అంటే చాలా ఇష్టమని, ఒక సారి మాట్లాడమని అమ్మ ఫోన్ చేసి ఇస్తే.. సర్ అని మాట్లాడేలోపే బాలయ్య బాబు(Balakrishna) బ్రో అని అన్నారని తెలిపారు. ఆ సమయంలో ఎలా మాట్లాడాలో తెలియలేదని చెప్పారు. కెరియర్ స్టార్టింగ్ లో చాలా మంది టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరక్టర్ల దగ్గర కీ బోర్డు ప్లేయర్‌గా ఉన్నానని తెలిపారు. ఆ సమయంలోనే తనకు మ్యూజిక్ స్టూడియో ఉందని తెలిపారు.
ఇక తన కుటుంబం మొత్తం సినిమా రంగంలోనే ఉందని, ఇప్పుడు తన కూతురు కూడా ఆర్టిస్ట్ అవుతానని అంటుందని వెల్లడించారు. బాలయ్య బాబుకు మ్యూజిక్ డైరెక్షన్ చేయాలని ఎంతో ఆశగా ఉందని పేర్కొన్నారు. భవిష్యత్తులో హీరోగా చేస్తారా.. విలన్‌గా చేస్తారా.. టాలీవుడ్లో ఏ హీరోకు మ్యూజిక్ చేయాలని ఉంది? రూల్స్ రంజన్ ఈవెంట్లో హీరోయిన్‌తో డ్యాన్స్ చేయడం?ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాల గురించి తెలియాలంటే హిట్ టీవీ పూర్తి ఇంటర్వ్యూను చూడాల్సిందే.