»Minimum Degree Fame Multi Star Manmadha Raja Exclusive Interview With Dev Tompala
Minimum Degree: పోలీసు స్టేషన్లో ప్రపోజ్ చేస్తావా అని పిచ్చ కొట్టుడు కొట్టారు
ఈ సినిమా అర్థం కావాలంటే మినిమమ్ డిగ్రీ చదవాలి లేదా ఐఏఎస్, ఐపీఎస్ చదవాలి అనే డైలాగ్‌తో సోషల్ మీడియాలో ఫేమస్ అయిన మల్టీస్టార్ మన్మథరాజ, అతని పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎన్నో ఆసక్తికర విషయాలను హిట్ టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు.
Minimum Degree Fame Multi Star Manmadha Raja Exclusive Interview With Dev Tompala
Minimum Degree: నల్గొండ జిల్లా మిర్యాలగూడ ప్రాంతంలో పుట్టి పెరిగి అక్కడే ఏమ్ఏ పొలిటికల్ సైన్స్ చదివానని మల్టీస్టార్ మన్మథరాజ(Multi Star Manmadha) తెలిపారు. అణచివేతకు గురైన ప్రతిచోట తను మాట్లాడుతానని అంటున్నాడు. అదే విషయంలో బిగ్ బాస్ హౌస్‌లో కంటెస్టెంట్స్‌తో పోటీ పడుతున్న పల్లవి ప్రశాంత్(Pallavi Prashanth) విషయంలో బాధపడుతున్నట్లు తెలిపారు. ఇక మినిమమ్ డిగ్రి చదవాలి అన్న డైలాగ్ ఏ సినిమా సందర్భంలో అన్నాడో, అసలు ఆ డైలాగ్ ఎందుకు అనాల్సి వచ్చిందో వివరించాడు. అలాగే తన దృష్టిలో కిందిస్థాయి వాళ్లు, పై స్థాయి వాళ్లు ఎవరో వెల్లడించాడు. అయితే తనకు మూవీ రివ్యూకు ఏ సంబంధం లేదని అందరిలా తాను డబ్బులు తీసుకొని రివ్యూలు చెప్పను అని తెలిపాడు. తన లైఫ్‌లో ఒక ట్రాజెడీ లవ్ స్టోరీ ఉందని తాను ఎప్పుడు ఒప్పుకున్నా తాళి కడుదామని తన చేతికే తాళి కట్టుకొని తిరుగుతున్నాడని చెప్పాడు. అలాగే తన లవ్ స్టోరీ గురించి అన్ని విషయాలను, తన పర్సనల్ లైఫ్‌లో, ప్రొఫెషనల్ లైఫ్‌లో జరిగిన అనేక విషయాలను హిట్ టీవీ(Hittvtelugu) ప్రేక్షకులతో పంచుకున్నాడు. మరి తన గురించి నిజాలు తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి.