• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వినోదం

విడుదలకి ముందే హాట్‌ హాట్‌గా కుబేర

భారీబడ్జెట్‌తో వస్తున్న కుబేర సినిమాకి ఏ లోటు లేదు. డబ్బుకి లోటు లేదు, థియేటర్లకు లోటు లేదు. మంది మార్బలంకి అస్సలు లోటు లేనే లేదు. కానీ ఎన్ని ఉన్నా సరే, సినిమాలో దమ్ము లేకపోతే అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఇది ఈ మధ్య రోజుల్లో ఎన్నో సినిమాల ఫెయిల్యూర్స్‌ నిరూపించి చూపించాయి. కానీ, కుబేర ఈ బ్రాకెట్‌లోనుంచి తప్పించుకున్నట్టుగా కనిపిస్తోంది.

June 5, 2025 / 12:16 PM IST

కన్నడ శివరాజ్‌ కుమార్‌కి కమల్‌ సెగ

మధ్రాసులో జరిగిన థగ్‌ లైఫ్‌ సినిమా ఈవెంట్‌లో కమల్‌ మాట్లాడుతున్నప్పుడు సభలో కన్నడ కంఠీరవ రాజ్‌కుమార్‌ గారబ్బాయి, అక్కడి అందరి అభిమాన కథానాయకుడు శివరాజ్‌ కుమార్‌ కూడా ఉన్నారు. ఇప్పుడు కమల్‌ మీద కన్నడిగులు ఎంతలా ఫైర్‌ అవుతున్నారో, శివరాజ్‌ మీద కూడా అంతే ఫైర్ అవుతున్నారు కర్ణాటకలో.

June 5, 2025 / 12:11 PM IST

సాయికుమార్‌కి పట్టిన గతే ఇప్పుడు కమల్‌కి

తమిళభాషలో నుంచే కన్నడ భాష ఆవిర్భవించిందన్న కమల్‌ మాటకి కర్ణాటక మొత్తం భగ్గుమంది. కమల్‌ ఎంత గొప్ప నటుడు అనే విషయాన్నే పూర్తిగా విస్మరించి, కమల్‌ని నానా బూతులు తిడుతున్నారు. ఆయన లేటెస్ట్‌ సినిమా మణిరత్నం దర్శకత్వంలో నటిస్తున్న థగ్‌ లైఫ్‌ చిత్రం విడుదల సందర్భంగా బెంగళూరులో జరిగిన ఈవెంట్‌లో కమల్‌ అనాలోచితంగా, అర్ధం పర్థం లేకుండా, అస్సలు సందర్భానికి ఏ మాత్రం సంబంధం లేకుండా తమిళభాషలోనుంచే కన్నడ భాష ప...

June 4, 2025 / 11:36 AM IST

రాజాసాబ్‌ టీజర్‌ టాక్‌

రాజాసాబ్‌ టీజర్‌లో ఉన్న గొప్ప విశేషం ఏంటంటే, ప్రభాస్‌ ఇంతవరకూ ఎప్పుడూ లేనంత ఫ్రెష్‌గా కనిపించడమే కాదు, చాలా చలాకీగా, హేండ్సమ్‌గా ఉన్నాడని చెబుతున్నారు. ఏ హీరోకైనా సరే, నిర్మాత టేస్ట్‌ అండ్‌ కెపాసిటీలు చాలా ఇంపార్టెంట్‌. దానికి తోడు దర్శకుడి హేండిలింగ్‌ కూడా తోడవ్వాలి. అప్పుడా కాంబినేషన్‌ హీరో ప్రజెన్స్ మీద, తనను తాను ప్రజెంట్‌ చేసుకునే విధానం మీద స్ట్రాంగ్‌ ఇంపాక్ట్‌ చూపిస్తుంది.

June 3, 2025 / 06:43 PM IST

కన్నప్ప హార్డ్‌ డ్రైవ్‌ని దొంగిలించింది వాళ్ళే

కన్నప్ప చిత్రంలో ప్రభాస్‌ కంటెంట్‌ ఉన్న హార్డ్ డ్రైవ్‌ని ఎవరో దొంగిలించారనే కలకలం పెద్ద సంచలనాన్నే సృష్టించింది. మరీ విడ్డూరం. ఇంత పెద్ద సినిమా, అందులో ప్రభాస్‌ కంటెంట్‌ ఉన్న హార్డ్‌ డ్రైవ్‌ని ఎవరో దొంగిలించేంత జాగ్రత్తగా ఉన్నారన్నమాట మంచు విష్ణు టీం అని విపరీతమైన ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి.

June 3, 2025 / 06:20 PM IST

వీరమల్లుని మోసేస్తున్నారు

ఇప్పటికే మూడు సార్లు విడుదల తేదీ వాయిదా పడిన దరిమిలా, అమెజాన్‌ ఓటిటి సంస్థ కాస్త ఇప్పటికే చాలా వరకూ ఇచ్చే డబ్బులో కట్ చేసుకుంటూ వచ్చిందని వినికిడి. కాగా, ప్రమోషన్లకి కూడా ఏ మాత్రం అవకాశం లేని రద్ధీలో సినిమా జూన్‌ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైపోయింది. ఒకసారి చూసుకుని, సినిమాలో ఏవైనా లోపాలుంటే గనక వాటిని ఎలా సరిదిద్దుకోవాలీ అనే సమీక్షకి కూడా ఊపిరాడని వ్యవహారంలో వీరమల్లు సినిమా ధియేట...

June 3, 2025 / 06:16 PM IST

ఈ అవార్డు ఆర్మీకే అంకితం

ఆలిండియా ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కి తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తమ నటుడు గద్దర్‌ అవార్డుకి సంబంధించి అల్లు అర్జున్‌ చెప్పిన మాట ఇది. నిజంగానే అల్లు అర్జున్‌ చాలా పెద్ద వార్‌ చేశాడు. పుష్ఫ 2లో ఎంతగా క్లైమాక్సు వరకూ ఫైట్‌ చేసి, చివరికి తనే తోపు అని నిరూపించుకున్నాడో అలాగే నిజజీవితంలో కూడా అంతే ఫైట్‌ చేశాడు. అదంతా మన కళ్ళ ముందే ఇటీవలే జరిగింది.

June 2, 2025 / 06:33 PM IST

కీరవాణి తగలబెట్టేశాడు.

ఆస్కార్‌ అవార్డు వచ్చినంత మాత్రాన కీరవాణి అద్భుతమైన, ప్రజారంజకమైన బాణీలు కడుతున్నారా అంటే లేదనే సమాధానమే సోషల్‌ మీడియా అంతా వినబడుతోంది. అస్సలు మెగాఫాన్స్‌ అయితే కీరవాణిని క్షమించే పరిస్థితుల్లో లేనే లేరనే వాతావరణం సోషల్‌ మీడియాలో బాహాటంగా కనిపిస్తోంది.

June 2, 2025 / 06:12 PM IST

అనుష్క ఘాటీ ఇంకా చూడలేదుట

దాదాపు నాలుగు కోట్లు రెమ్యూనరేషన్‌ పుచ్చుకునే అనుష్కను తెరమీద నాజూగ్గా చూపించాలంటే మరికొంత సిజీలకి ఖర్చు అవుతుంది. అది కూడా అంత వీజీగా అయ్యే పని కాదు. దానికీ బోలెడు ఖర్చు. తడిసి మోపెడు అవుతుందనే విషయం పరిశ్రమలో వారికే కాదు, ట్రేడ్‌లో ఉన్నవారికి కూడా అంటే డిస్ట్రిబ్యూటర్ల దగ్గర్నుంచీ ఎగ్జిబిటర్ల వరకూ అందరికీ తెలిసిన రహస్యమే.

June 2, 2025 / 05:36 PM IST

డిజిటల్‌ కబంధ హస్తాలలో విశ్వంభర

మెగాస్టార్‌ చిరంజీవి సినిమాకే వచ్చిందంటే ఇంక సినిమా పరిశ్రమ బోర్డు తిప్పేసే పరిస్థితే వచ్చిందని లెక్క కడుతున్నారు సినిమా పెద్దలు. విశ్వంభర ఎంతగొప్పగా ప్రారంభమైందో, అంతే లోతుగా పడిపోయింది. ఫస్ట్‌ రిలీజ్‌ అయిన గ్లింప్సే నిరుత్సాహపరిచింది. దాంతో క్రేజ్‌ కాస్త నీరుగారిపోయింది. సోషల్‌ మీడియా మొత్తం కత్తి కట్టినట్టుగా విశ్వంభర సినిమాని మోసేశాయి. కోలుకోలేని దెబ్బ తగిలింది మెగాస్టార్‌ ఇమేజ్‌కి.

June 2, 2025 / 03:47 PM IST

జానీ జానీ నో జానీ..

తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీలో వీరిద్దరి మధ్య చెలరేగిన గాలి దుమారం మామూలుది కాదు. కొందరు జానీ మాస్టర్‌ మీద సదభిప్రాయంతో శ్రష్టి ఊసెత్తకుండా ఉండమని హెచ్చరించినట్టుగానే మందిలిస్తూ హితవు చెప్పారు. దానికి జానీ మాస్టర్‌ అతని భార్య కూడా నీతివాక్యాలు చెబుతూ, తామెంత శ్రష్టికి సాయపడ్డామో ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పడం మొదలెట్టారు.

June 2, 2025 / 03:39 PM IST

గద్దర్‌ అవార్డుకే అలంకారం, ఆభరణం

కొన్ని చిత్రాలకు అవార్డులొస్తే ఆయా చిత్రాలకు విలువలు, గుర్తింపూ లభిస్తాయి. కొన్ని చిత్రాలను వరించడం ద్వారా కొన్ని అవార్డులకు గుర్తింపు లభ్యమవుతుంది. కల్కి చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఈ బెస్ట్‌ ఫిల్మ్‌ అవార్డు, దాదాపు 14 సంవత్సరాలుగా మూగబోయిన తెలంగాణ సినిమా అవార్డుల సంబరాలకు ఎనలేని వన్నె తెచ్చింది.

May 29, 2025 / 05:06 PM IST

మిరాయ్‌ టీజర్‌లో అది రాముడే

తేజాసజ్జా, మంచు మనోజ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ భారీ చిత్రం ప్రస్తుతానికి ఓ ఆసక్తికరమైనదే. ఎందుకంటే హనుమాన్‌ లాంటి కంట్రీవైడ్‌ బ్లాక్‌బస్టర్‌ తర్వాత వస్తున్న తేజ సినిమా ఇది. అందులో హనుమంతులవారు ప్రధానమైన పాత్ర. ఆయనవల్లే హనుమాన్‌ హిట్‌ అయిందన్నవారు కూడా లేకపోలేదు.

May 29, 2025 / 02:38 PM IST

ఎప్పుడు రాజాసాబ్‌కి విముక్తి..?

మారుతీ దర్శకత్వంలో ప్రభాస్‌ లాంటి మైఠీహీరో చేస్తాడంటే ట్రేడంతా ఒక్కసారిగా గొల్లుమంది. ప్రభాస్‌కేమైనా పిచ్చి పట్టిందా అని నోటికొచ్చినట్టుగా మాట్లాడుకున్నారు. ముఖ్యంగా వైజయంతీ మూవీస్‌ లాంటి అగ్రనిర్మాణ సంస్థ భారీ ఎత్తున కల్కి సినిమా ప్రారంభించి ఓ పక్కన పెద్ద యుద్ధం జరుగుతుంటే మరోపక్కన ఈ చింతకాయ సినిమా ప్రభాస్‌ సినిమా సైన్‌ చేయగానే ఎవ్వడికీ అర్ధం కాలేదు. తలలు పట్టుకున్నారు.

May 29, 2025 / 02:38 PM IST

రాపో ఒక్కడు సరిపోడు….అందుకే ఉపేంద్ర

రాపో ( రామ్‌ పోతినేని) హీరోగా వచ్చిన గతంలో సినిమాలన్నీ బాక్సాఫీసు దగ్గర మొత్తం బొక్కబోర్లా పడ్డాయి. ఇండివిడ్యువల్‌ హీరోగా రాపోకి ఎందుకో ఇంతవరకూ ఓ మాస్‌ ఇమేజ్‌గానీ, పాప్యులర్‌ స్టయిల్‌గానీ ఏమాత్రం సొంతం కాలేదు. తనవరకూ తనైతే వీరఫోజులు కొడుతూ, ఎమోషనల్‌గా చెలరేగిపోతూ ఉక్కిరిబిక్కిరి అయిపోతుంటాడు స్క్రీన్‌ మీద. కానీ ధియేట్రికల్‌ ఇంపాక్ట్‌ మాత్రం శూన్యం. బోయపాటి శీను లాంటి మహామాస్‌ మాస్‌ డైరెక్టర్‌ స...

May 29, 2025 / 10:53 AM IST