కార్తీక పౌర్ణమిని 26వ తేదీన ఆదివారం రోజున జరుపుకోవాలని పండితులు సూచించారు. ఆ రోజు పనికిరాని వారు మరుసటి రోజు లేదంటే మళ్లీ వచ్చే వారం జరుపుకోవచ్చని పేర్కొన్నారు.
Kartika Poornami: కార్తీక మాసం.. ఆ మహాశివుడిని భక్తులు విశేషంగా పూజలు చేస్తుంటారు. ఉదయం, సాయంత్రం రెండు పూటలా దీపం పెడతారు. కొందరు నెలరోజులు పూజ చేస్తే.. మరికొందరు 4 లేదంటే 5 సోమవారాలు చేస్తారు. మరికొందరు ఏకాదశి రోజున పూజలు చేస్తుంటారు. ఈ ఏడాది అధిక మాసం రావడంతో.. దాదాపు పండుగులు అన్నీ రెండురోజుల్లో వస్తున్నాయి. దీంతో కన్ఫ్యూజన్ నెలకొంది. ఇప్పుడు కార్తీక పౌర్ణమి (Kartika Poornami) కూడా రెండు రోజులు వచ్చింది. దీనిపై పండితులు క్లారిటీ ఇచ్చారు.
కార్తీక పౌర్ణమి (Kartika Poornami) రోజున నదీ స్నానం ఆచరిస్తారు. దానం చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు. 26వ తేదీ ఆదివారం, 27వ తేదీన సోమవారం రెండు రోజులు కార్తీక పౌర్ణమి ఘడియలు ఉన్నాయి. దీంతో ఏ రోజు పూజ చేయాలనే సందేహాం కలుగుతుంది. దీనిపై పండితులు స్పష్టంచేశారు. 26వ తేదీన మధ్యాహ్నం 3.53 నుంచి సోమవారం మధ్యాహ్నం 2.45 గంటల వరకు పౌర్ణమి ఉంది. ఆదివారం రోజు రాత్రి పౌర్ణమి ఉండటంతో.. ఆ రోజు పండగ జరుపుకోవాలని పండితులు సూచించారు.
ఉదయంతోపాటు సాయంత్రం దీపం వెలిగించడం ముఖ్యం.. పౌర్ణమి రోజున సాయంత్రం పూట ఆ శివ పార్వతులను పూజిస్తే కోరిన కోరికలు వెంటనే తీరతాయి. పౌర్ణమి ఘడియ, కృతిక నక్షత్రం ఉన్నప్పుడే పౌర్ణమి జరుపుకోవాలి. ఆ ఘడియలు 26వ తేదీన ఉండటంతో ఆ రోజు జరుపుకోవాలని కోరుతున్నారు.
ఒకవేళ ఏదో కారణంతో పనికి రాకుంటే మరుసటి రోజు.. ఆ రోజు వీలు కాకుంటే మళ్లీ వచ్చే రోజు పూజ చేయాలని కోరారు. సో.. కార్తీక పౌర్ణమి 26వ తేదీన.. ఆదివారం జరుపుకోవాలని పండితులు చెప్పారు.