ఈ రోజు రాశులు అందరికి కలిసి వస్తాయి. కాకపోతే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఈ రోజు మీకు శుభకరంగా మారుతుంది. ప్రయాణాల్లో అప్రమత్తత ఉండాలి. మీ పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. కలహాలు ఏర్పడే ప్రమాదం ఉంది.
శోభకృత్ నామ సంవత్సరం వైశాఖ మాసం ద్వాదశి ఈ రోజు. ఏ రాశి వారికి ఈరోజు కలిసి వస్తుంది? ఏ రాశి వారికి మంగళవారం ఎలా ఉంటుందో తెలుసుకోండి. ఈ రోజు రాశి ఫలాలు ఇలా ఉన్నాయి.
మేషం: కుటుంబ పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. చేపట్టిన పనులను పట్టుదలతో విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త వింటారు. శివుడి ధ్యాన శ్లోకం పఠించాలి.
వృషభం: రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ప్రయాణాలు విజయవంతమవుతాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. శివ అష్టోత్తరం చదివితే శుభం జరుగుతుంది.
మిథునం: కొన్ని పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగి అందరి ప్రశంసలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. శివుడికి అభిషేకం చేయాలి.
కర్కాటకం: కుటుంబ పరిస్థితుల్లో మార్పుల వలన మానసిక ఆందోళన చెందుతారు. చేపట్టిన పనులు ఆలస్యమవుతాయి. ముఖ్యమైన నిర్ణయాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దుబారా ఖర్చులు తగ్గించుకోవాలి. శ్రీలక్ష్మీ గణపతిని సందర్శించుకోవాలి.
సింహం: ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించవద్దు. కొన్ని సంఘటనలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక వార్త మిమ్మల్ని ఆనందింపజేస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి.
కన్య:స్వల్ప విషయాల్లో మానసిక ఆందోళనకు లోనవుతారు. ఆవేశం తగ్గించుకోవాలి.. సహనం పెంచుకోవాలి. ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కీలకమైన పనులకు అవాంతరాలు ఎదురవుతాయి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి.
తుల: చేసే ప్రయత్నాలకు ఆటంకాలు కలుగుతాయి. ప్రత్యర్థులను ఓడించాలనే పట్టుదల వీడాలి. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ పనుల్లో ఆత్మీయుల తోడు లభిస్తుంది. చంద్రశేఖర అష్టకం పఠించాలి.
వృశ్చికం: కొత్త పనులు చేపడతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. సుఖ సంతోషాలతో ఉల్లాసంగా ఉంటారు. ఒక మంచి వార్త మీ మనోధైర్యాన్ని పెంపొందిస్తుంది. వేంకటేశ్వర స్వామిని ఆరాధించాలి.
ధనుస్సు: కుటుంబపరంగా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మిక ధన నష్టం కలుగనుంది. మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆవేశానికి గురి కాకూడదు. సమిష్టిగా అందరిని కలుపుకుని వెళ్లితే సానుకూల ఫలితాలు ఉంటాయి. గోవిందనామ స్మరణ చేయాలి.
మకరం: కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశం ఉంది. ప్రయాణాల్లో అప్రమత్తత ఉండాలి. మీ పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. ప్రతికూల పరిస్థితులు ఉంటాయి. కలహాలు ఏర్పడే ప్రమాదం ఉంది. దక్షిణామూర్తి స్తోత్రం పఠించాలి.
కుంభం: ప్రయత్నం లోపం లేకుండా ఉంటే పనులు పూర్తవుతాయి. బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక జాగ్రత్తలు పాటించాలి. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. సానుకూల వాతావరణం ఉంటుంది. లక్ష్మీ గణపతిని ఆరాధించాలి.
మీనం:అనవసర భయాలు తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు ఉంటాయి. ముఖ్యమైన విషయంలో ప్రశంసలు దక్కుతాయి. కుటుంబసభ్యులతో ఆనందంగా ఉంటారు. ఒక శుభవార్త వింటారు. దుర్గాదేవిని దర్శించుకోవాలి.