కళియుగ ప్రత్యక్ష దైవంగా తిరుమల శ్రీవారిని కొలుస్తారు. తిరుమలలో డ్రోన్ కెమెరాల వినియోగంపై నిషేధం ఎప్పటినుంచో ఉంది. తాజాగా తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం కలకలం రేపింది. ప్రస్తుతం ఆలయ డ్రోన్ షాట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆ వీడియో ఇన్ స్టాగ్రామ్ పేజీ ఐకాన్ అనే అకౌంట్ నుంచి అప్లోడ్ అయ్యిందని టీటీడీ గుర్తించింది. విజిలెన్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కు చెందిన వ్యక్తులు డ్రోన్ షాట్స్ తీసినట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు ఇలా డ్రోన్ షాట్లు తీస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారని భక్తులు ఫైర్ అవుతున్నారు.