మేషం
ఈ రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన రోజు అవుతుంది. మీ విజయం పట్ల ఆశాజనకంగా ఉంటారు. విద్యార్థులు లాభపడతారు. రుణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం.
వృషభం
మీరు మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో మంచి మార్పును చూస్తారు. ఆస్తి కలిసొస్తుంది. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ప్రమాదకర పనులు జాగ్రత్తగా చేయండి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. దూర బంధువులతో కలుస్తారు. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది.
మిథునం
మనసులో ఆందోళన ఉంటుంది. అనుకున్న పని పూర్తి కాకపోవడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది.మీ ప్రత్యర్థుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది.అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. అనవసర భయానికి లోనవుతారు. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపార రంగంలోనివారు జాగ్రత్తగా ఉండటం మంచిది.
కర్కాటకం
మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. ఈ రాశి ఉద్యోగులు పదోన్నతి గురించి అధికారులతో మాట్లాడేందుకు మంచి సమయం ఇదే. కుటుంబానికి సమయం కేటాయిస్తారు. స్నేహితుల నుంచి ప్రయోజనం పొందుతారు. వ్యాపార పరిస్థితి సాధారణంగా ఉంటుంది.కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి.
సింహం
మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తగా నిర్వహించాలి.
కన్య
ఈ రోజు మీరు ఎవరికీ సలహాలు ఇవ్వకండి. అనుకోని వివాదాలు జరిగే ప్రమాదం ఉంది. ప్రభుత్వ పనులనుంచి మీరు ప్రయోజనం పొందుతారు. నూతన వ్యక్తులను కలుస్తారు. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. స్త్రీల మూలకంగా శతృబాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది.
తుల
ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. వివిధ మార్గాల నుంచి ఆదాయం ఉంటుంది.మీ కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. రుణబాధలు తొలగుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.
వృశ్చికం
మీ ఆలోచనల ప్రభావం ఇతరులపై పడుతుంది. ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలమవుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీల మూలకంగా ధనలాభం ఉంటుంది.మీ ఆలోచనల ప్రభావం ఇతరులపై పడుతుంది.
ధనుస్సు
మీ మాటలను అదుపులో ఉంచుకోండి. మీ సన్నిహితులు మీనుంచి దూరమవుతారు. అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. నూతన వస్తు, ఆభరణాలు సేకరిస్తారు.
మకరం
మీ ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కొన్ని పనులపై ప్రయాణం చేయవచ్చు. విదేశాల్లో ఉంటున్న కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు.వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది.
కుంభం
ఈ రోజు కొత్త మూలాల నుంచి మీ ఆదాయం పెరుగుతుంది. నూతన ఇంటి కొనుగోలు లేదా నిర్మాణానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటారు. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. కుటుంబానికి సమయం కేటాయిస్తారు.
మీనం
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. మీ స్నేహితుల్లో ఒకరి నుంచి మంచి వార్తా వినే అవకాశం ఉంది. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగాల్లో చేరుతారు.నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తారు.