»Kishan Reddy Challenges The Kaleshwaram Project Corruption Investigation On Cm Kcr
Kishan Reddy: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణకు కేసీఆర్ సిద్ధమా?
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బిఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ప్రాజెక్ట్ తెలంగాణ రాష్ట్ర అవినీతి, విఫలమైన ప్రాజెక్టుల లీకేజీలకు" "లక్షణ చిహ్నం"గా మారిందని ఆరోపించారు. అంతేకాదు ఇటివల మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికను ప్రస్తావించారు.
Kishan Reddy challenges the Kaleshwaram project corruption investigation on cm kcr
తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండగా మారిందని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి(Kishan Reddy)విమర్శించారు. నాలుగేళ్లలోనే ప్రాజెక్టు కుంగిపోయిందని, నాణ్యత లేని నాసిరకం నిర్మాణం చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు(kaleshwaram project) ద్వారా రైతులకు వచ్చేది 40 వేల రూపాయలు అయితే..ప్రాజెక్టు నిర్వహణ కోసం ఎకరాకు చేసిన ఖర్చు రూ.85 వేలు అని పేర్కొన్నారు. ఇంత తేడా ఉన్న ప్రాజెక్టును కేసీఆర్ కమిషన్లు, కంట్రాక్టర్ల లబ్ధి కోసమే నిర్మించారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఆర్థిక భారం తప్ప ఏం ఉపయోగం లేదని గుర్తు చేశారు. డ్యాం సెఫ్టీ అధికారులు అడిగిన 9 ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు సమాధానం చెప్పలేదన్నారు. కేసీఆర్ ఇంజినీర్ కావడం వల్లనే కాళేశ్వరం ప్రాజెక్టుకు ఈ దుస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఈ మేరకు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భాగంగా కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగుబాటుపై ప్రభుత్వం కనీసం సమాధానం చెప్పలేదని పరిస్థితి నెలకొందనన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు(kaleshwaram project) మేడిగడ్డ బ్యారేజీకి జరిగిన నష్టంపై సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి శుక్రవారం డిమాండ్ చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద బహుళ దశల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌గా పేర్కొనబడిన బ్యారేజీ స్తంభాలు పగుళ్లు ఏర్పడటం ఏంటని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టు అవినీతిపై న్యాయ విచారణకు రావాలని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో దీనికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నైతిక బాధ్యత వహించాలని అన్నారు. రాష్ట్రంలో బీజేపీ(BJP) అధికారంలోకి వస్తే ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపి అవకతవకలకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
National Dam safety Authority has given its report on Kaleshwaram project’s sinking of piers at Medigadda barrage
Report says – Sinking of piers is a result of a combination of issues related to planning, design, quality control, and operation and maintenance.
మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటుపై డ్యామ్ సేఫ్టీ అథారిటీ కేంద్రానికి నివేదిక(report) ఇచ్చిందన్నారు. ప్లానింగ్, డిజైన్, నాణ్యతలేమి, నిర్వహణ లోపాల వల్ల మేడిగడ్డ ప్రాజెక్టులోని పిల్లర్ కుంగిపోయిందన్నారు. పునాది కింద ఇసుక కొట్టుకుపోయి పిల్లర్లు బలహీనపడ్డాయని చెప్పారన్నారు. ఫౌండేషన్ మెటీరియల్ పటిష్ఠత తక్కువగా ఉండటం కూడా పిల్లర్ కుంగుపాటుకు కారణమని చెప్పారన్నారు. బ్యారేజీ ప్లానింగ్, డిజైనింగ్ సరిగ్గా లేకపోవడం వైఫల్యమని నివేదిక చెప్పినట్లు తెలిపారు. డ్యామ్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్ల బ్యారేజీ క్రమంగా బలహీనపడుతోందన్నారు. మేడిగడ్డ బ్యారేజీ ఒక బ్లాకులో ఉత్పన్నమైన సమస్య మొత్తం బ్యారేజీకే ముప్పు తెచ్చిందన్నారు. సమస్య పరిష్కరించే వరకు మొత్తం బ్యారేజీని ఉపయోగించే అవకాశం లేదని కమిటీ తెలిపిందన్నారు. మొత్తం బ్లాకులను పునాదుల నుంచి తొలగించి తిరిగి నిర్మించాలని సూచించినట్లు చెప్పారు.