Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 May 27th).. విమర్శలను ఎదుర్కొంటారు.
ఈ రోజు(2024 April 27th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
మొదలుపెట్టిన పనుల్లో దిగ్విజయం పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఒక ముఖ్యమైన పని పూర్తి అవుతుంది. సమాజంలో కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.
వృషభం
అప్పులు తొందరగా అందుతాయి. శుభకార్యాల మూలకంగా ధనవ్యయం పెరుగుతుంది. ప్రయాణాలు అధికంగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి.
మిథునం
పట్టుదలతో కొన్నికార్యాలు పూర్తిచేసుకొంటారు. పిల్లలపట్ల జాగ్రత్త అవసరం. మీమీ రంగాల్లో గౌరవ, మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు బాగుంటాయి. స్వల్ప అనారోగ్య బాధలు వేధిస్తాయి.
కర్కాటకం
మీరు చేసే పనులు మీకు గౌరవాన్ని తీసుకొస్తాయి. కుటుంబ పరిస్థితులు వలన మానసిక ఆందోళన చెందుతారు. చేయాల్సిన పనులు ఆలస్యంగా పూర్తిచేస్తారు. వృత్తిరీత్యా అప్రమత్తంగా ఉండటం మంచిది. విమర్శలను ఎదుర్కొంటారు.
సింహం
మొదలు పెట్టిన పనులకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికపరిస్థితి బాధపెడుతుంది. కొత్తపనులు ప్రారంభించకూడదు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
కన్య
ప్రయాణాలు ఎక్కువ చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చిన్న చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్త పడాలి. సహనం అన్నివిధాలా మంచిది. ఆవేశంవల్ల కొన్ని పనులు జరగవు.
తుల
ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలుంటాయి. స్త్రీల మూలకంగా శతృబాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది.
వృశ్చికం
చేయాలనుకున్న పనులు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా ఉంటారు. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. కొన్ని విషయాల్లో సంతోషాన్ని పొందుతారు.
ధనుస్సు
కుటుంబ పరిస్థితులు సంతోషకరంగా ఉంటాయి. సహనం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రులతో కలహం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అనవసర ధనవ్యయంతో రుణప్రయత్నాలు చేస్తారు. అనారోగ్య బాధలు వేధిస్తాయి.
మకరం
చిన్నచిన్న గొడవలు జరిగే అవకాశం ఉంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోవాలి. ప్రయాణాల్లో అప్రమత్తత చాలా అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి అప్పుకోసం ప్రయత్నం చేస్తారు.
కుంభం
సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. స్వల్ప అనారోగ్య బాధలు కలుగుతాయి. మీమీరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు.
మీనం
దీర్ఘకాలిక భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మీమీ రంగాల్లో రంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు వేధిస్తాయి. రుణప్రయత్నాలు చేస్తారు.