»Do You Know What Is Special And Unique About Onam Festival In Kerala
Onam festival: ఓనం పండుగ ప్రత్యేకత ఏంటో తెలుసా..?
బలిచక్రవర్తిని భూమి మీదకు ఆహ్వానిస్తూ కేరళ రాష్ట్ర ప్రజలు పది రోజుల కన్నుల పండుగలా జరుపుకునే ఓనం పండుగకు చారిత్రక నేపథ్యం ఉంది. ప్రజలంతా రంగులు, పూలతో, కొత్త బట్టలు కట్టుకొని సంతోషంగా గడుపుతారు. మహాబలి ఇంటింటికి వచ్చి వారి ఆనందాన్ని చూస్తాడనేది వీరి విశ్వాసం.
Do you know what is special and unique about Onam festival in Kerala?
Onam festival: ఓనం పండుగ (Onam festival)కు 1961లో జాతీయ గుర్తింపు లభించింది. కేరళ (kerala)లో అట్టహాసంగా జరిగే ఈ పండుగ.. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి(Sankranthi), దసరా(Dussera) పండుగంత వైభవంగా జరుపుకుంటారు. పది రోజులు చేసుకునే ఈ ఫెస్టివల్ మొదటి రోజును అతమ్గా, పదోరోజును తిరు ఓనమ్ అని పిలుస్తారు. కేరళ రాష్ట్రం అంతా పదవ రోజును ఎంతో ఆడాంబరంగా నిర్వహిస్తారు.
వెల్ కం..
పాతాళాధిపతి అయిన మహాబలిచక్రవర్తి(Balichakravarthi)ని భూమిపైకి ఆహ్వానిస్తూ.. సంతోషంగా ఉన్నామని తేలియజెప్పే నమ్మకంతో ఆ పది రోజుల కన్నుల పండుగగా జరుపుతారు. మహాబలి పాలించిన సమయం స్వర్ణయుగంగా అభివర్ణిస్తారు. బలిచక్రవర్తి పాలనలో రాజ్యంలో ప్రజలంతా సుఖశాంతులతో, సిరిసంపదలతో వర్థిల్లారని, అందుకే రాక్షస రాజు అయినప్పటికీ బలిచక్రవర్తిని పూజిస్తారు. ఆయనపై గౌరవంతో శ్రీమహా విష్ణువు వరంతో కేరళ రాష్ట్ర ప్రజలు పదిరోజుల పాటూ మహాబలిని పాతళలోకం నుంచి భూమి మీదకు అహ్వానిస్తూ ఓనం జరుపుకుంటారు. ఇదే వేడుగను కొన్ని రాష్ట్రాల్లో వామన జయంతిగా నిర్వహిస్తారు.
శ్రీ మహావిష్ణువు (Shri Mahavishnu) పరమ భక్తుడైన ప్రహ్లాదుడి మనవడు బలిచక్రవర్తి. తాత ప్రహ్లాదుడి సమక్షంలో విద్యాబుద్ధులు నేర్చుకోవడంతో మహాబలి కూడా గొప్ప విష్ణుభక్తుడిగా పెరుగుతాడు. బలిచక్రవర్తి విశ్వజిత్ యాగం చేసి దానధర్మాలు చేసి అత్యంత శక్తివంతుడు అవుతాడు. పాలనను విస్తరించుకుంటూ దేవతల రాజు అయిన ఇంద్రుడిపై యుద్దం ప్రకటించి ఇంద్రలోకంపై దండెత్తి వశం చేసుకుంటాడు. బలిచక్రవర్తిని ఎదుర్కొడం ఎవరివళ్ల కాదు. దీంతో దేవతలంతా చెల్లాచెదురైపోయి రక్షించమంటూ శ్రీ మహా విష్ణుని వేడుకుంటారు. వారికి అభయం ఇచ్చి అదితి అనే రుషిపత్ని గర్భాన వామనుడిగా జన్మిస్తాడు.
మూడు అడుగుల స్థలం
బాలుడిగా నారయణుడు బలి దగ్గరకు వెళతాడు. మునులను, రుషులను శ్రద్దాసక్తులతో గౌరవించే బలి.. వామనుడికి అతిథి మర్యాదలు చేసి ఏం కావాలని అడుగుతాడు. వామనుడు మూడు అడుగుల స్థలం కావాలంటాడు. అందులోని ఆంతర్యం తెలియక సరేనని మాటిస్తాడు బలి చక్రవర్తి. అప్పుడు వామనుడు భూమి మీద ఒక అడుగు, ఆకాశం మీద ఒక అడుగు పెట్టి మూడో అడుగు ఎక్కడ పెట్టాలని అడుగగా తన తల మీద పెట్టమంటాడు బలిచక్రవర్తి. అలా బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కేస్తాడు వామనుడు. బలి దాన గుణానికి సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఏటా కొన్ని రోజులు భూమిపైకి వచ్చి తన రాజ్యాన్ని చూసుకునేట్టు వరం ఇస్తాడు. అలా బలిని భూమి మీదకు ఆహ్వానిస్తూ జరుపుకునేదే ఓనం పండుగ. బలిచరక్రవర్తిని ఆహ్వానిస్తూ ఇంటి ముందు రంగురంగుల పూలతో రంగవల్లులు తీర్చిదిద్దుతారు. ఓనం ఆటలతో ఆడిపాడుతారు.
9 రకాల వంటకాలు
పండుగ చివరిరోజు జరుపుకునే తిరుఓణం నాడు తయారుచేసే ఓణసద్య (ఓణవిందు)కు ప్రత్యేకత ఉంది. ఇది 11 నుంచి 13 అతి ముఖ్యమైన పదార్ధములతో కూడిన తొమ్మిది రకాల భోజనం. ఓణసద్యను అరటి ఆకుల్లో కుటుంబసభ్యులంతా కూర్చొని భోజనం చేస్తారు. ఓణంలో ఆకట్టుకునే మరొ విశేషం వల్లంకలి అనబడే పడవల పందెము, ఇది పంపానదిలో జరుగుతుంది. ఇది కూడా కన్నుల పండుగలా జరుగుతుంది.