»Diwali If You Do These 5 Mistakes In Puja You Will Suffer May Goddess Lakshmi Bless You
Diwali: పూజలో ఈ 5 తప్పులు చేస్తే కష్టాలు..లక్ష్మీ దేవి అనుగ్రహం పొందండిలా
దీపావళి అనేది ప్రతి ఒక్కరికీ ఎంతో ముఖ్యమైన పండగ. ఈ శుభదినం రోజు పూజ చేసేవారు కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. అవి ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
దీపావళి ఎంతో ప్రత్యేకమైన పండగ. ఈ శుభదినం రోజు లక్ష్మీదేవిని అందరూ పూజించడం ఆనవాయితీ. అయితే పూజ సమయంలో కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలి. లేకుంటే కోరి కష్టాలను కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. దీపావళి పూజ టైంలో చిన్న చిన్న పొరపాట్లు రావడం సహజం. అయితే లక్ష్మీదేవిని పూజిస్తే ఏడాది పాటు అన్నీ సుఖసంతోషాలు కలుగుతాయి. ఈ పూజ ద్వారా ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. మరి దీపావళి పూజలో ఏయే తప్పులు చేస్తే మంచిది కాదో ఓసారి తెలుసుకుందాం.
దీపావళి రోజు ప్రతి ఒక్కరూ ముగ్గులు వేస్తుంటారు. అలా ముగ్గులతో లక్ష్మీదేవికి స్వాగతం చెబుతారు. లక్ష్మీపూజకు ముందు ఇంటిని రంగోలితో అలంకరించాలి. అలాగే ఇంటిని పూర్తిగా శుభ్రం చేసుకున్న తర్వాతే పూజను ప్రారంభించాలి. పూజకు ముందు కాళ్లు, చేతులు శుద్దిగా కడిగిన తర్వాత పూజలో కూర్చోవాలి. ఇలా చేయకుండా పూజ చేస్తే ఫలితం ఉండదు.
లక్ష్మీదేవి, గణపతి విగ్రహాలను పూజ సమయంలో ఏర్పాటు చేసుకుంటారు. పూజ సమయంలో లక్ష్మీదేవి విగ్రహాన్ని గణపతికి కుడి వైపు ఉంచాలి. లక్ష్మీదేవిని కూడా కమలంపై కూర్చోని ఆశీర్వదిస్తున్నట్లుగా ఉండే ప్రతిమను పూజించడంతో శుభ ఫలితాలు పొందుతారు. దీపావళి రోజు ఇనుము లేదా స్టీల్ పీఠాన్ని ఉపయోగిస్తారు. కానీ చెక్కపీటను ఉపయోగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. చాలా మంది స్టీల్ పీటపై ఉంచడం వల్ల అది శుభ సూచకాలను ఇవ్వదని పరిగణించాలి.
పూజ సమయంలో పీఠంపై వేసే దుస్తులు కూడా ఎరుపు, పసుపు రంగువి ఉండాలి. నలుపు, నీలం రంగు దుస్తులను అస్సలు వినియోగించొద్దు. విగ్రహ ప్రతిష్టకు ముందుగా పూల రేకులతో అక్షతలు వేసి విగ్రహాలను పూజించాలి. ఈ పూజలో విరిగిన పాత్రలు, విరిగిన విగ్రహాలను అస్సలు ఉపయోగించకూడదు. కలశం ఏర్పాటు చేసుకోవడం ఎంతో ఉత్తమం. పూజలో కొబ్బరికాయ కలశంలో నాణెం కచ్చితంగా వేయాలి.
దీపావళి పూజ పూర్తయిన తర్వాత పీఠాన్ని తీయకూడదు. పూజ చేసిన తర్వాత ఆ స్థలాన్ని ఎప్పుడూ శుభ్రం చేయకూడదు. పూజ సమయంలో లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని, లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని భావిస్తారు. అందుకే ఆ స్థలాలన్ని శుభ్రం చేయకూడదని పండితులు చెబుతున్నారు.