»Good News For Couples Who Are Going To Get Married If You Send The Address The Ttd Will Send Them
TTD: పెళ్లిచేసుకోబోయే జంటలకు గుడ్‌న్యూస్..అడ్రస్ పంపితే ఆ కానుకలు పంపనున్న టీటీడీ
నూతన వధూవరులకు తిరుమల తిరుపతి దేవస్థానం గుడ్ న్యూస్ చెప్పింది. తమ శుభలేఖలు, పూర్తి అడ్రస్ పంపితే వారికి శ్రీవారి తలంబ్రాలు, ప్రసాదాలు, పసుపు-కుంకుమ, కంకణాలు పంపనున్నట్లు ప్రకటించింది.
పెళ్లి చేసుకోబోయే నూతన వధూవరులకు (NewlyWeds) తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupathi Devasthanams) శుభవార్త చెప్పింది. కొత్త జీవితాన్ని ప్రారంభించబోయే వారికి తిరుమల (Tirumala) శ్రీవారి ఆశీస్సులు పొందే అవకాశాన్ని టీటీడీ (TTD) కల్పించింది. కొత్త జంటలు తమ పూర్తి చిరునామాతో శుభలేఖలు పంపితే వారికి శ్రీవారి తలంబ్రాలు, పసుపు, కుంకుమ, కంకణాలు, కళ్యాణ సంస్కృతి పుస్తకం, ప్రసాదాలను వారి అడ్రస్‌కే తిరుమల దేవస్థానం పంపనుంది.
అప్పట్లో ఈ విధానం అమలులో ఉండగా కరోనా వల్ల దానిని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) నిలిపివేసింది. మళ్లీ ఆ కొత్త జంటలకు ఈ అవకాశాన్ని కల్పిస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. నూతన వధూవరులు తమ శుభలేఖలను శ్రీవెంకటేశ్వర స్వామి, ఈ.ఓ ఆఫీస్, టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, కే.టీ.రోడ్, తిరుపతి 517501 అడ్రస్‌కు పంపాల్సి ఉంటుంది. అలాగే తమ పూర్తి అడ్రస్‌ను (Full Address) కూడా కచ్చితంగా పంపితే టీటీడీ నుంచి వారికి శ్రీవారి కానుకలు అందుతాయి.
నూతన వధూవరులు తమ కళ్యాణంలో తొలి ఘట్టంగా కంకణధారణ చేపడుతారు. ఉపద్రవాల నుంచి రక్షాబంధనంగా భావిస్తూ కంకణాలను ధరిస్తారు. అలాగే పద్మావతి అమ్మవారి ఆశీస్సులతో కూడిన కుంకుమను, కంకణాన్ని అందిస్తారు. నవ దంపతులకు సకల మంగళాలు కలగాలని ఆకాంక్షిస్తూ శ్రీవారి ఆశీస్సులతో తలంబ్రాలను టీడీడీ పంపనుంది. అయితే వివాహ ముహూర్తానికి నెల రోజుల ముందుగానే పెళ్లి కార్డును పంపాలని తిరుమల తిరుపతి దేవస్థానం తెలుపుతోంది.