Awesome Things You Can Do On Diwali Instead Of Bursting Crackers
దీపావళి పండగ వచ్చేస్తోంది. ఈ నెల 12వ తేదీన దీపావళి పండగ. దీపావళి అనగానే అందరూ టపాసులు కొని, కాలుస్తూఉంటారు. టపాసులు కాల్చడం శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యానికి కారణం అవుతుంది. కాలుష్యాన్ని అరికట్టేందుకు పండగ రోజున టపాసులు కాల్చడం పక్కన పెట్టి, మరి కొన్ని పనులు చేయడంతో పండగను సంతోషంగా జరుపుకోవచ్చు. అవేంటో ఓసారి చూద్దాం…
1. ఫ్యామిలీ మీట్
ఈ రోజుల్లో బిజీ లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది కనీసం కుటుంబంతో సమయం గడిపే అవకాశం దొరకడం లేదు. పండగ రోజున సరదాగా కుటుంబంతో గడపడంపై దృష్టిసారించాలి. కుటుంబ సభ్యులతో కలిసి గడపండి. ఒక చిన్న ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి. లేదా కొంతకాలంగా మీరు చూడని బంధువులతో కలిసి కలుసుకోవడం దీపావళిని జరుపుకోవడానికి అనువైన మార్గం.
2. గిప్ట్స్ ఇవ్వడం
దీపావళికి స్నేహితులు , కుటుంబ సభ్యుల కోసం బహుమతులు కొనుగోలు చేయాలి. బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఇంతకుముందు కూడా సంప్రదాయంలో భాగమే. ఇప్పుడు మీ చేతిలో ఎక్కువ సమయం, డబ్బు ఉన్నందున.. ప్రియమైన వారికి ప్రత్యేకంగా బహుమతి ఇవ్వడానికి ప్రయత్నించండి.
3. ఇంటిని అలంకరించడం, శుభ్రపరచడం
దీపావళి అంటే వెలుగుల పండుగ. మీ ఇంటిని దీపాలు, ఇతర రకాల ఫాన్సీ లైట్లతో అలంకరించడం కంటే దానిని ప్రకాశవంతంగా మార్చడానికి మంచి మార్గం ఏం ఉంటుంది. అదనంగా, కుటుంబం మొత్తం కలిసి సరదాగా ఇంటిని శుభ్రపరిచే పనినిపెట్టుకోవాలి. వాడ్ రోబ్స్ శుభ్ర పరచండి. ఫ్యాన్లు, కిటికీలను శుభ్రం చేయండి!
4. పేదలకు సహాయం చేయండి
మీరు ఈ సంవత్సరం క్రాకర్స్ కోసం ఖర్చు చేయని మొత్తం డబ్బు నుంచి, పేదలకు కొన్ని బొమ్మలు, పుస్తకాలు, కొత్త బట్టలు కొనండి.
5. విందులు సిద్ధం
పండుగ వేడుకల్లో తయారు చేయబడిన అత్యుత్తమ వంటకాలు ఉన్నాయి. నచ్చిన వంటకాలు స్వయంగా వండుకోవడం లాంటి పనులు చేయాలి. స్వయంగా వండి, కుటుంబ సభ్యులకు వడ్డించవచ్చు.