Raja శ్యామల యాగం చేస్తోన్న కేసీఆర్.. ముచ్చటగా మూడోసారి అధికారం దక్కేనా..?
ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుకుంటున్నారు. తన సెంటిమెంట్ ప్రకారం మూడో సారి రాజశ్యామల యాగం చేస్తున్నారు. యాగ ఫలంతో అధికారం చేపడుతానని భావిస్తున్నారు.
CM Kcr: తెలంగాణ సీఎం కేసీఆర్కు (CM Kcr) పట్టింపులు ఎక్కువ. ఆచార, వ్యవహారాలు, పద్ధతులు.. పూజలు, యజ్ఞ, యాగాదులకు ప్రాధాన్యం ఇస్తారు. ఇప్పటికే పలుమార్లు చండీయాగం (chandiyagam) చేశారు. ఆయుత చండీయాగం కూడా చేశారు. ఆ యాగాన్ని బట్టి ఫలితం వస్తోంది. మరో 29 రోజుల్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నిక జరగబోతుంది. ఈ క్రమంలో రాజశ్యామల యాగం (rajashyamala yagam) చేస్తున్నారు.
బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి యాగం కొనసాగుతోంది. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ఆధ్వర్యంలో యాగం జరుగుతోంది. 200 మంది వైదికులు యాగంలో పాల్గొన్నారు. తెలంగాణతోపాటు ఏపీ, కర్ణాటకకు చెందిన పీఠాధిపతులు యాగంలో పాల్గొన్నారు.
రాజశ్యామల అమ్మవారు, చండీ అమ్మవారు
రాజశ్యామల అమ్మవారు, చండీ అమ్మవార్లతోపాటు ఐదుగురిని ఆవాహనం చేసుకుని హోమం నిర్వహిస్తారు. రెండో రోజు వేద పారాయణాలు చేస్తారు. మూడో రోజు (చివరి రోజున) పూర్ణాహుతితో యాగం ముగియనుంది. యాగాన్ని నిర్వహించిన ప్రతిసారి ఎన్నికల్లో కేసీఆర్ విజయం సాధిస్తున్నారు. రెండుసార్లు అలానే విజయం సాధించారు. ఇప్పుడు మూడోసారి యాగం చేస్తున్నారు.
మరో ఛాన్స్
తమకు మరో అవకాశం ఇవ్వాలని, అభివృద్ధి చేయాల్సి ఉందని కేసీఆర్ అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా ఉంది. అభ్యర్థులు కూడా క్షేత్రస్థాయిలో ప్రజలను కలుస్తున్నారు. బీజేపీకి మాత్రం సీట్లు పెరిగే అవకాశం లేదు. ఆ పార్టీలో ఉన్న నేతలు కొందరు నిరాసక్తితో ఉన్నారు. మరికొందరు ముఖ్య నేతలు పార్టీ మారుతున్నారు. కేసీఆర్కు యాగ ఫలం దక్కుతుందో లేదో చూడాలి. రెండుసార్లు గెలిచినట్టు మూడో సారి గెలుస్తారా..? లేదంటే కాంగ్రెస్ వైపు జనాలు మొగ్గుచూపుతారో చూడాలి.