»Fireworks Victims Queue For Sarojini Devi Eye Hospital
Diwali Effect : సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి పేషెంట్ల క్యూ
హైదరాబాద్లోని సరోజినిదేవి కంటి ఆస్పత్రికి పేషంట్లు క్యూకడుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి సుమారు 60 మంది ఇప్పటికే కంటి సమస్యలతో హాస్పిటల్లో చేరారు. ఆసుపత్రిల జాయిన్ అయ్యిన వారంత దీపావళి సందర్భంగా టపాసులు పేలుస్తూ గాయపడినవారే.
దేశ వ్యాప్తంగా ప్రజలు దీపావళి (Diwali) వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. దీపావళి సందర్భంగా ప్రజలు పెద్ద ఎత్తున టపాసులు కాలుస్తూ ఎంజాయ్ చేశారు. కాగా ఈ వేడుకల్లో మహానగర వ్యాప్తంగా పలు ప్రమాదాలు జరిగాయి. దీంతో హైద్రాబాద్ సరోజినీ దేవి కంటి ఆస్పత్రి (Sarojini Eye Hospital) లైన్ కట్టారే. నిన్న జరిగిన దీపావళి టపాసులు పిలుస్తున్న సమయాల్లో పలు ప్రమాదాలు జరిగాయి. ముఖ్యంగా కంటికి జరిగిన ప్రమాదాలే అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది నిన్న రాత్రి నుంచి ఈ రోజు ఉదయం వరకు దాదాపు 60 మందికి పైగా బాధితులు ఆస్పత్రికి వచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో పెద్దలు, పిల్లలు ఇద్దరు ఉన్నారు. ఒక్క సరోజినీ దేవి కంటి ఆస్పత్రిలోనే 60 మంది చెరితే.. మొత్తం హైదరాబాద్ (Hyderabad) లోని కంటి ఆస్పత్రుల్లో ఎంత మంది చేరి ఉంటారో అనే ప్రశ్నఉత్పన్నమవుతుంది. రోడ్లపై ఎక్కడ చూసిన బాణసంచా వ్యర్థాలు కనిపిస్తున్నాయి. పారిశుద్థ్య సిబ్బంది రంగంలోకి దిగి, వాటిని శుభ్రం చేస్తున్నారు.
టపాసులు (Tapas) కాల్చే సమయంలో చేతి వేళ్లతో పాటు కళ్ళు కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశముంది. చిన్నారులు, గర్భిణులు, ఆస్తమా వ్యాధిగ్రస్తులు, సీనియర్ సిటిజన్లు గాయపడే ప్రమాదం ఉందం ఉంటుంది. అందువల్ల వారు టపాసులకు దూరంగా ఉండటం మంచిది. టపాసులు పేల్చడానికి ముందు, ప్యాకింగ్(Packing)లపై ఉండే సూచనలు తప్పకుండా పాటించాలి. అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం గల ప్రాంతాలకు దూరంగా మాత్రమే టపాసులు పేల్చాలి. భవనాలు, చెట్లు, పూరిగుడిసెలు , ఎండుగడ్డి లాంటి చోట బాణాసంచా పేల్చడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు (While baking) పెద్దలు పక్కనే ఉండాలి. దగ్గరుండి వారితో టపాసులు కాల్పించాలి. పెద్ద శబ్దం వచ్చే బాంబులకు పిల్లలను దూరంగా ఉంచాలి. దీపావళి సామగ్రికి సమీపంలో కొవ్వొత్తులను, అగరువత్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉంచవద్దు. టపాసులు కాల్చేటప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే చూపు కోల్పోయే ప్రమాదం ఉందని డాక్టర్లు (Doctors) హెచ్చరిస్తున్నారు. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.