Diwali Muhurat Trading: దీపావళి (Diwali) రోజు స్టాక్ మార్కెట్ల స్పెషల్ ట్రేడింగ్ జరుగుతుంది. గంట సేపు జరిపే ట్రేడింగ్‌ను ముహూరత్ ట్రేడింగ్ అంటారు. ఆ సమయాన్ని ఇన్వెస్టర్లు స్పెషల్‌గా భావిస్తారు. పండుగ రోజున పెట్టుబడి పెడితే కచ్చితంగా లాభాలు వస్తాయని భావిస్తారు. 12వ తేదీ (ఆదివారం) సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 7.15 గంటల వరకు ట్రేడింగ్ జరగనుంది. 15 నిమిషాలు ప్రీ మార్కెట్ సెషన్ ఉంటుందని స్టాక్ ఎక్స్చేంజీలు తెలిపాయి.
ముహూరత్ ట్రేడింగ్ సమయంలో ఇన్వెస్ట్ చేస్తే ఏడాది మొత్తం లాభాలు వస్తాయని ఇన్వెస్టర్లు విశ్వసిస్తారు. ముహూరత్ సమయంలో ట్రేడింగ్ చేయడం వల్ల శ్రేయస్సు, ఆర్థిక వృద్ధి లభిస్తోందని భావిస్తారు. ఈక్విటీ, కమోడిటీ డెరివేటివ్, కరెన్సీ డెరివేటివ్, ఈక్విటీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్, సెక్యూరిటీల లెండింగ్ అండ్ బారోయింగ్ వంటి విభాగాలలో ట్రేడింగ్ చేస్తారు. 10 ముహూర్తపు ట్రేడింగ్ సెషన్లలో ఏడుసార్లు స్టాక్ మార్కెట్ సానుకూల రాబడితో ముగిశాయని మాస్టర్ ట్రస్ట్ ఎండీ హర్జీత్ సింగ్ అరోరా తెలిపారు. లాంగ్ టైమ్ కోసం ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయాలని సూచించారు.