»Nita Ambani Receives Special Edition Luxury Rolls Royce Cullinan Of Worth 10 Crore
Mukesh Ambani: దటీజ్ అంబానీ.. భార్యకు రూ.10కోట్ల కారు గిఫ్ట్
ఆసియాలోనే అత్యంత ధనికుడు ముఖేష్ అంబానీ అన్న విషయం తెలిసిందే. అంబానీ కుటుంబం అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుతుంది. ఆ కుటుంబ సభ్యులంతా ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు.
Mukesh Ambani: ఆసియాలోనే అత్యంత ధనికుడు ముఖేష్ అంబానీ అన్న విషయం తెలిసిందే. అంబానీ కుటుంబం అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుతుంది. ఆ కుటుంబ సభ్యులంతా ఖరీదైన కార్లను కలిగి ఉన్నారు. వీరి గ్యారేజీని జియో గ్యారేజీగా పిలుస్తారు. బహుశా దేశంలో అత్యంత ఖరీదైన, లగ్జరీ కార్ గ్యారేజీలో వీరిది ఒకటి. వీళ్ల గ్యారేజీలో హై ఎండ్ సూపర్ కార్లు, లగ్జరీ కార్లు సహా అనేక SUVలు ఉంటాయి.
జియో గ్యారేజీలో అనేక లగ్జరీ కార్లు ఉన్నప్పుటికి అంబానీ కుటుంబానికి మాత్రం మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్రాస్ కార్లు అంటే చాలా ఇష్టం. ఈ జియో గ్యారేజీలోకి మరో కొత్త కారు వచ్చి చేరింది. రోల్స్ రాయిస్ కల్లినన్ (Rolls Royce Cullinan)ను కొనుగోలు చేశారు ముఖేష్ అంబానీ. తాను ఈ కారును తన భార్య నీతా అంబానీకి బహుమతిగా ఇచ్చారు. రోల్స్ రాయిస్ కల్లినన్ కారు ప్రత్యేక బ్లాక్ బ్యాడ్జ్ ఎడిషన్‌గా తెలుస్తోంది. ఈ కారు ధర రూ.8.2 కోట్లు (Ex show room)గా ఉంది. అదే ఆన్‌రోడ్(on road) ధర సుమారు రూ.10 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది. ఈ కారు భారత్‌లోనే అత్యంత ఖరీదైన కారుల్లో ఒకటి.
నీతా అంబానీ(nita ambani) ఈ కొత్త కారులో ప్రయాణించిన వీడియోను CS 12 Vlogs యూట్యూ్బ్ ఛానల్ పోస్ట్ చేసింది. భద్రతా సిబ్బంది కార్ల మధ్య కొత్త రోల్స్ రాయిస్ కల్లినన్ కారు కనిపించింది. నీతా అంబానీ కాన్వాయ్(convay)లో ఎంజీ గ్లోస్టర్, టయాటా ఫార్చ్యునర్, మెర్సిడెస్ బెంజ్ G కార్లు కూడా ఉన్నాయి. ఈ రోల్స్ రాయిస్ కల్లినన్ (Rolls Royce Cullinan) బ్లాక్ బ్యాడ్జ్ మోడల్.. స్టాండర్డ్ కారుతో పోలిస్తే ఎక్సీరియర్ నలుపు రంగులో ఉంటుంది. అయితే స్టాండర్డ్ కారు మాదిరిగా 6.75 లీటర్ ట్విన్ టర్బోఛార్జడ్ V12 పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ ఇంజిన్ 600 bhp శక్తి, 900Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్ 8-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది. రోల్స్ రాయిస్ కల్లినన్ కారు 22 అంగుళాల అల్లాయ్ వీల్స్, కాంట్రాస్ట్ రెడ్ బ్రేక్ కాలిపర్స్ ఉన్నాయి. ఈ కారలో ఫ్రంట్ గ్రిల్ సరౌండ్, సైడ్ ప్రేమ్ ఫినిషర్లు, బూట్ హ్యాండిల్, బూట్ ట్రిమ్, లోయర్ ఎయిర్ ఇన్‌టేక్ ఫినిషర్, ఎగ్జాస్ట్ పైప్‌లపై డార్కెస్ట్ క్రోమ్ వినియోగించారు.