సాధారణంగా కార్తీక మాసం మొత్తం సాత్విక ఆహారం తీసుకోవడం ఉత్తమం. ఈ మాసంలో మాంసాహారం, మద్యం సేవించడం, ఉల్లి, వెల్లుల్లి, గుమ్మడి కాయ తినడం నిషేధం. అయితే, కార్తీక ఆదివారం రోజున కొబ్బరి, ఉసిరికాయ తినకూడదని పండితులు సూచిస్తున్నారు. ఉసిరిచెట్టును లక్ష్మీస్వరూపంగా, విష్ణుమూర్తి కొలువై ఉండే వృక్షంగా భావిస్తారు. ఆదివారం ఉసిరిని ఆహారంగా తీసుకోరాదని కొన్ని సంప్రదాయాలు చెబుతున్నాయి.