AP: శ్రీకాళహస్తి ఆలయంలోని పైకప్పులో లీకేజీలు ఏర్పడ్డాయి. గత శుక్రవారం నుంచి కురుస్తున్న వర్షాలతో ఆలయం పైకప్పు నుంచి నీరు వస్తోంది. అయితే పూణేకు చెందిన ఓ నిర్మాణ సంస్థ లీకేజీల నివారణకు సంప్రదాయ పద్ధతిలో పూత వేసినా ఆ సమస్య తీరలేదని ఆలయ అధికారులు తెలిపారు. రాహుకేతు పూజలు నిర్వహించే ప్రాంతంలో ఎక్కువగా ఈ సమస్య ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.