దీపావళి పర్వదినం తెల్లవారుజామున తలకు నువ్వుల నూనె పెట్టుకొని తలంటుస్నానం చేయాలి. స్నానం చేసే నీటిలో మర్రి, మామిడి, అత్తి, జువ్వి, నేరేడు ఆకులను వేసి, ఆ నీటితో స్నానం చేస్తే ఆరోగ్యకరం, మంగళప్రదం. ఇవాళ చేసే అభ్యంగన స్నానం సర్వపాపాలను హరింపచేయడమే గాక గంగాస్నానంతో సమానమైన ఫలితం ఇస్తుందని పూర్వీకులు చెబుతున్నారు. అనంతరం విధిగా లక్ష్మీపూజ చేయాలి.