భార్య భర్తల మధ్య మనస్పర్థలు రావడం చాలా సహజం. ఆ గొడవల కారణంగా ఒకరినొకరు తిట్టుకోవడం, కొట్టుకోవడం మహా అయితే విడిపోవడం లాంటివి మీరు చూసే ఉంటారు. కానీ… ఓ మహిళ భర్త మీద కోపంతో… ఉరి వేసుకుంటే.. ఆపాల్సిన భర్త కాస్త.. దానిని వీడియో తీశాడు. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా… ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్(uttar pradesh Kanpur) పట్టణానికి చెందిన శోభితా గుప్తా, సంజీవ్ భార్యభర్తలు. కాగా…గత కొంతకాలంగా.. దంపతుల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. అయితే… భర్త మీద కోపంతో గతంలో ఒక సారి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే.. అది విఫలమైంది. అప్పటి నుంచి మళ్లీ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా భర్త ఇంట్లో ఉండగానే.. బెడ్ రూంలోని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.
అతని కళ్ల ముందే ఆమె ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. అది చూసి కూడా అతను ఆపకపోగా… దానిని వీడియో తీయడం గమనార్హం.శోభిత తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు. దీంతో షాక్ కు గురైన ఆమె తల్లిదండ్రులు వెంటనే కూతురి ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఆమె మృతదేహం మంచంపై పడి ఉండడాన్ని గుర్తించారు.
“మేము ఇంటికి చేరుకున్నప్పుడు, మా కుమార్తె మృతదేహం మంచం మీద పడి ఉంది. సంజీవ్ ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి బదులుగా ఆమెను అటూ, ఇటూ తిప్పుతున్నాడు. మేము వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాం, అక్కడ ఆమె చనిపోయినట్లు నిర్ధారించారు. అప్పుడు సంజీవ్ మాకు వీడియో చూపించాడు. ఆమె ఇంతకు ముందు కూడా ఉరి వేసుకోవడానికి ప్రయత్నించిందని అతను చెప్పాడు” అని శోభిత తండ్రి రాజ్‌కిషోర్ చెప్పారు. పోలీసులు శోబిత మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించారు. వీడియోతో సహా మొత్తం ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.