Viral News: చలి తీవ్రత పెరిగింది. ఇక ఉత్తారాది రాష్టాల్లో దీని ప్రభావం కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో చలి నుంచి ఉపశమనం పొందడానికి ఒక కుటుంబం బొగ్గుల కుంపటి ఏర్పాటు చేసుకున్నారు. అదే వారు చేసిన అతిపెద్ద పొరపాటు. దాంతో ఆ కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. పిల్లలంతా నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ బాధిత కుటుంబం అమ్రెహా జిల్లాలో నివాసం ఉంటున్నారు.
సోమవారం రాత్రి పడుకునే ముందు చలిని నుంచి రక్షణ పొందెందుకు బొగ్గుల కుంపటి(coal fire)ని అంటించారు. ఇళ్లు కాస్త వేడెక్కిన తరువాత దాన్ని ఆర్పడం మరిచిపోయి వెచ్చగా నిద్రించారు. ఆ సమయంలో ఇంటి తలుపులు, కిటీకీలు మూసివేసి ఉన్నాయి. వారు నిద్రలో ఉండగా కుంపటి నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో ఊపిరాడక ఐదుగురు చిన్నారులు నిద్రలోనే చనిపోయారు. మంగళవారం రోజు సాయంత్రం వరకు ఆ ఇంటి నుంచి ఎవరు బయటకు రాకపోవడంతో స్థానికులు తలుపులు తెరించేందుకు ప్రయత్నించారు. లోపలి వైపు నుంచి గడియ పెట్టి ఉండడంతో తలుపు పగలగొట్టారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కొల్పోగా, తమ తల్లిదండ్రులు అపస్మారక స్థితిలో ఉన్నారు. వారిని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.