ఓ డ్రగ్ డీలర్ ఇంటికి సోదాలు చేసేందుకు పోలీసులు వస్తే శునకాలు వారిపై విరుచుకుపడ్డాయి. పదునైన పళ్లతో పోలీసులను భయపెట్టాయి. ఈ సంఘటన కేరళలోని కొట్టాయంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు..పోలీసులు ఓ డ్రగ్ డీలర్ ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో వారిపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. పోలీసులు వాటి నుంచి తప్పించుకునేసరికి అవతల డ్రగ్ డీలర్ అక్కడి నుంచి పరారయ్యాడు.
ఆఖరికి ఆ కుక్కలను శాంతింపజేసిన పోలీసులు ఆ ఇంట్లో సోదాలు చేపట్టారు. 17 కేజీల గంజాయిని సీజ్ చేశారు. నిందితుడి ఇంట్లోని కుక్కలు చాలా క్రూరంగా ప్రవర్తించాయని, అదృష్టవశాత్తూ తమ సిబ్బందికి గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు.
డ్రగ్ డీలర్ ఆ కుక్కలను చాలా పద్దతిగా శిక్షణ ఇ్చాడని, ఖాకీ దుస్తులు వేసుకుని ఎవరైనా అక్కడికి వస్తే అవి కరిచేలా శిక్షణ ఇచ్చినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ఆ డ్రగ్ డీలర్ ఇంట్లో ఉన్న 13 కుక్కలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.