Snake Carcass: గర్భిణీలు ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం వాళ్లకు పౌష్టికాహారం అందిస్తోంది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందిస్తుంటారు. ప్రస్తుతం గర్భిణీలకు పాలు, గుడ్లు, బెల్లం, ఖర్జూరం వంటివి ఇస్తున్నారు. ఖర్జూరం వంటి వాటిని ప్యాకెట్ రూపంలో ఇస్తారు. కొందరికి ఇందులో పురుగులు వంటివి కనిపిస్తాయి. ఓ గర్భిణీకి ఏకంగా పాము కళేబరమే కనిపించింది. చిత్తూరుకి చెందిన మానస అంగన్వాడీలో ఇచ్చే ఖర్జూరం ప్యాకెట్ తీసుకుంది. ప్యాకెట్ తీసుకుని పుట్టింటికి వెళ్లింది.
వెళ్లిన తర్వాత ఖర్జూర ప్యాకెట్ తీసి చూడగా పాము కళేబరం కనిపించింది. షాక్ అయిన ఆమె వెంటనే మహిళా అంగన్వాడీ సూపర్వైజర్కు చెప్పింది. సీడీపీఓకి ఘటనను వివరించింది. ఈ ప్యాకెట్లో పాము కళేబరం ఉండటం నిజమే. ఆ కళేబరం ఖర్జూరం ప్యాకెట్లోకి ఎలా వచ్చిందో తెలియదని చెప్పారు. ఈ ఘటనను ఉన్నతాధికారులకు తెలియజేశామని, దర్యాప్తు చేస్తామని కూడా తెలిపారు. మానసకు మరో ప్యాకెట్ ఇవ్వమని అంగన్వాడీ గుత్తేదారునికి ఆదేశాలు జారీచేశారు.