Six people were stabbed in a kindergarten in China's Guangdong province.
చైనా(china)లోని ఆగ్నేయ గ్వాంగ్డాంగ్ (Guangdong) ప్రావిన్స్‌లో ఓ కిండర్‌గార్టెన్‌లో కత్తిపోట్లతో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. కత్తితో అడ్డు అదుపు లేకుండా అందరిమీదకు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు మరణించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. ఈ దాడికి పాల్పడిన 25 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే ఈ ఘటనలో అభంశుభం తెలియని అమాయకులు ఆరు మంది బలయ్యారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఓ టీచర్, ఇద్దరు పేరెంట్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన వార్తలను ఓ ఆంగ్ల పత్రిక రాసుకొచ్చింది.
ఈ దాడి (China kindergarten stabbing) సోమవారం ఉదయం 7.40 సమయంలో చోటు చేసుకొంది. దాడి జరిగిన 20 నిమిషాల్లోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. అయితే ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన దాడి అని పోలీసులు తెలిపారు. మాములు పాశ్చత్యదేవాలు అయిన అమెరికా, ఆస్ట్రేలియా, కెనడ తదితర దేశాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతుంటాయి. కానీ చైనాలో ఇటువంటి దాడులు చాలా తక్కువగా చోటు చేసుకొంటాయి. అయితే ఈ మధ్య చైనాలో కూడా ఇలాంటి దాడులు పెరుగుతున్నాయని తెలుస్తోంది. ఈ కత్తిపోట్లు దాడులు పాఠశాలల్లో కూడా అధికమౌతున్నాయి. గతేడాది ఆగస్టులో కూడా జియాగ్సీ ప్రావిన్స్‌లోని ఓ కిండర్‌గార్టెన్‌లో కత్తిపోట్ల ఘటన చోటు చేసుకొంది. దీనిలో ముగ్గురు మరణించగా.. ఆరుగురు గాయపడ్డారు.
ఇక ఏప్రిల్‌లో 2021లో గువాగ్సీ ఝువాంగ్ అటానమస్ ప్రాంతంలో కూడా ఇలా కత్తిపోట్ల ఘటన చోటుచేసుకుంది. ఇందులో ఇద్దరు చనిపోయారు. మొత్తం ఈ దాడిలో 16 మంది గాయపడ్డారు. ఈ ఘటనల జరుగుతున్న తరుణంలో పాఠశాల విద్యార్థులలో ఈ ఘటనల నుంచి ఎలా తప్పించుకోవాలని శిక్షణ కూడా ఇస్తున్నారు. చైనా ప్రభుత్వం 2010 నుంచే పాఠశాలల వద్ద భద్రతను పెంచారు. అయినా సరే ఈ దాడులు అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయి. విద్యార్థులు, టీచర్ల భద్రతను పెంచాలని చైనా ప్రభుత్వం చూస్తోంది.