Girl arrested : నవీన్ హత్య కేసులో సంచలనం.. అమ్మాయి అరెస్ట్
బీటెక్ స్టూడెంట్ నవీన్ (Naveen) మర్డర్ కేసు కీలక మలుపు తిరిగింది. నిందితుడు ప్రియురాలు నిహారికా (Niharika),అతని స్నేహితుడు హసన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ (Abdullahpurmet) నవీన్ హత్య కేసులో తాజాగా దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసులో ప్రియురాలు నిహారిక రెడ్డిని పోలీసులు నిందితురాలిగా చేర్చారు. ప్రియురాలి కోసమే నవీన్‌ను హత్య (Murder) చేసిన హరిహర కృష్ణ.(Harihara Krishna). హత్య చేసిన తర్వాత నిహారికకు వాట్సాప్‌లో ఫోటోలు పంపాడు. అంతేకాదు..
బీటెక్ స్టూడెంట్ నవీన్ (Naveen) మర్డర్ కేసు కీలక మలుపు తిరిగింది. నిందితుడు ప్రియురాలు నిహారికా (Niharika),అతని స్నేహితుడు హసన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ (Abdullahpurmet) నవీన్ హత్య కేసులో తాజాగా దిమ్మతిరిగే ట్విస్ట్ వెలుగు చూసింది. ఈ కేసులో ప్రియురాలు నిహారిక రెడ్డిని పోలీసులు నిందితురాలిగా చేర్చారు. ప్రియురాలి కోసమే నవీన్‌ను హత్య (Murder) చేసిన హరిహర కృష్ణ.(Harihara Krishna). హత్య చేసిన తర్వాత నిహారికకు వాట్సాప్‌లో ఫోటోలు పంపాడు. అంతేకాదు.. అదే రోజు రాత్రి సంఘటనా స్థలానికి నిహారికను తీసుకువెళ్లి, నవీన్ మృతదేహాన్ని హరిహర కృష్ణ చూపించాడు. మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. నిహారికతో పాటు మిత్రుడు హసన్ కూడా ఘటనా స్థలానికి వెళ్లాడు. నవీన్ మృతదేహాన్ని(Dead body) చూసిన అనంతరం.. హరిహర కృష్ణకు నిహారిక రెడ్డి కొంత మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసింది. అక్కడ కాసేపు ఉన్న ఈ ముగ్గురు.. తిరిగి తమతమ ఇళ్లకు వెళ్లిపోయినట్టు తెలిసింది.
విస్తుగొలిపే ఈ విషయాలన్ని విచారణలో (investigation)తేలడంతో.. A2గా నిహారికను, A3గా హసన్‌ను పోలీసులు (Police) చేర్చారు. కాగా.. నవీన్, హరిహర కృష్ణ, నిహారిక రెడ్డి ఇంటర్మీడియట్లో కలిసి చదువుకున్నారు. తొలుత కృష్ణ, నిహారిక ప్రేమించుకున్నారు. అయితే.. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో దూరమయ్యారు. అనంతరం నవీన్‌కి నిహారిక దగ్గరైంది. ఈ క్రమంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమ (Love) విషయం తెలిసి మండిపోయిన హరిహర కృష్ణ.. తన ప్రియురాలు (Girlfriend) దూరమవుతుందన్న భయంతో నవీన్‌ని హతమార్చేందుకు స్కెచ్ వేశాడు. ఫిబ్రవరి 17వ తేదీన తన ఇంటికి వచ్చినప్పుడు.. హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. నవీన్‌కు హాస్టల్‌కు డ్రాప్ చేయాలని బైక్ మీద బయల్దేరినప్పుడు.. నిహారిక రెడ్డి విషయమై ఆ ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అప్పుడే హరిహర కృష్ణ తనతోపాటు తెచ్చుకున్న కత్తితో నవీన్‌ని పొడిచి చంపాడు. అనంతరం గుండె, చేతులు, పెదవులు, సీక్రెట్ భాగాలను సైతం కోశాడు. ఈ భాగాల ఫోటోలను నిహారిక రెడ్డికి వాట్సాప్‌లో పంపగా.. ‘గుడ్ బాయ్’ అంటూ నిహారిక రిప్లై ఇచ్చింది. అది చూశాకే పోలీసులు(Police) అనుమానం వచ్చి, నిహారిక కోణంలో దర్యాప్తు చేయగా.. పై సంచలన నిజాలు బయటపడ్డాయి.