ఘోరం: చెరువులో పడి ముగ్గురు బాలికలు మృతి తెలంగాణలోని వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్న విషాదం వీరసముద్రం చెరువులో ప్రమాదవశాత్తు పడిన ముగ్గురు బాలికలు బట్టలు ఉతకడానికి వెళ్లి చెరువులో పడినట్లు సమాచారం మృతులు తిరుపతమ్మ(12), సంధ్య(9), దీపిక(7)గా గుర్తింపు సమ్మర్ సేలువుల నేపథ్యంలో విద్యార్థుల పేరెంట్స్ అప్రమత్తంగా ఉండాలంటున్న అధికారులు
ఢిల్లీలో లిక్కర్ స్కాం ఘటన మరువక ముందే తాజాగా ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో లిక్కర్ కుంభకోణం(liquor scam) వెలుగులోకి వచ్చింది. అయితే ఇది ఢిల్లీలో స్కాం కంటే ఇది పెద్దదని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ దందాలో ప్రధాన నిందితుడు ధేబర్ సహా పలువు అగ్ర రాజకీయ నాయకులు, ఐఏఎస్ అధికారులు కూడా ఈ కేసులో ఉన్నట్లు ఈడీ చెబుతోంది.
కేరళలో (Kerala) ఘోర ప్రమాదం (Tragedy) చోటుచేసుకుంది. నదిలో ప్రయాణిస్తున్న డబుల్ డెక్కర్ పడవ (Boat) ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఏకంగా 22 మంది మరణించారు. మృతుల్లో అత్యధికంగా చిన్నారులు (Children) ఉండడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈ సంఘటనపై ప్రధాని మోదీ (Modi), ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి...
రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో భారత వైమానిక దళానికి చెందిన మిగ్ 21 యుద్ధ విమానం కూప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మరణించారు. అయితే విమానం పైలట్ మాత్రం సురక్షితంగా ఉన్నారు. ఈ విమానం సూరత్‌గఢ్ నుంచి బయలుదేరినట్లు తెలుస్తోంది. గత వారం ప్రారంభంలో జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో భారత ఆర్మీ హెలికాప్టర్ కూలిపోగా తెలంగాణకు చెందిన ఓ టెక్నిషియన్ మృతి చెందారు. అంతకుముందు మధ్యప్రదేశ్‌లోని ...
మాల్ లోని స్మాష్ బౌలింగ్ గేమింగ్ ప్లే జోన్ లో పిల్లలు ఆడుకుంటున్నారు. ఈ క్రమంలో చిన్నారి రోబోటిక్ స్పేస్ షటిల్ మిషీన్ వద్దకు వెళ్లింది. అయితే ఆ మెషీన్ వెనుక భాగం తెరిచి ఉంది. అది కూడా ఆడుకునేదిగా భావించి ఆ యంత్రం లోపల చేయి పెట్టగా చేతివేళ్లు నుజ్జనుజ్జయ్యాయి. గట్టిగా రోదించడంతో తల్లిదండ్రులు అక్కడకు చేరుకున్నారు.
అమెరికాలోని (America) టెక్సాస్ (Texas)లో చోటుచేసుకున్న తుపాకీ కాల్పుల్లో (Gun Fire) తెలంగాణ అమ్మాయి మృతి చెందింది. డల్లాస్ (Dallas) నగర శివారులోని ఓ మాల్ లో దుండగుడు జరిగిన కాల్పుల్లో 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. వారిలో హైదరాబాద్ (Hyderabad)కు చెందిన విద్యార్థి చనిపోయింది. ఉన్నత విద్య (Higher Education) కోసం వెళ్లిన ఆ యువతి తుపాకీ కాల్పుల్లో మరణించడంతో ఆ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా వ...
కాకపోతే అప్పటికే దట్టంగా వ్యాపించిన మంటల్లో కార్మికులు చిక్కుకున్నారు. కాగా భూగర్భంలో వంద మీటర్ల లోతున కార్మికులు పని చేస్తున్నారని అక్కడి అధికారులు తెలిపారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (Brij Bhushan) ఆదివారం ఓ వీడియో సందేశాన్ని రిలీజ్(Video Release) చేశారు. తనపై ఒక్క లైంగిక ఆరోపణ రుజువైనా తాను ఉరేసుకుంటానని ప్రకటించారు.
పంజాబ్ అమృత్సర్ గోల్డెన్ టెంపుల్ సమీపంలోని హెరిటేజ్ స్ట్రీట్‌లో శనివారం అర్ధరాత్రి ‘పేలుడు’ సంభవించింది. ఈ ఘటన జరిగిన తర్వాత అమృత్‌సర్‌లో భయాందోళనలు వ్యాపించాయి. అనేక మంది పర్యాటకులు, భక్తులు గాయపడ్డారు. పేలుడు ధాటికి గాజు ముక్కలు పగిలిపోవడం వల్లే గాయాలు అయ్యాయని పోలీసులు చెబుతున్నారు. సారాగర్హి సరాయ్ పార్కింగ్ దగ్గర నుంచి పేలుడు సంభవించింది. దీంతో ఐదు నుంచి ఆరుగురికి గాయాలయ్యాయి....
వరుడిపై తిట్ల దండకం మొదలుపెట్టారు. పెద్దలు సద్దుమణిగేలా చొరవ తీసుకున్నారు. అయితే వధువు మనస్తాపానికి గురైంది. వెంటనే అతడిని పెళ్లి చేసుకోలేనని తేల్చి చెప్పింది. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ కు చేరింది.
మాల్ బయట ఓ దుండగుడు కారు నిలిపాడు. అనంతరం బయటకు వచ్చి కారు దిగుతూనే తుపాకీ పేలుస్తూ మాల్ లోకి ప్రవేశించాడు. విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో షాపింగ్ కోసం మాల్ కు వచ్చిన వారు మృతి చెందారు.
బ్యాటింగ్ చేసిన అనంతరం ఒక ఓవర్ బౌలింగ్ వేశాడు. అనంతరం వెన్నునొప్పి అంటూ మధ్యలోనే వెళ్లిపోయి కారులో విశ్రాంతి కోసం వెళ్లాడు. కారులోనే కుప్పకూలిపోయాడు. ఆట అనంతరం స్నేహితులు వచ్చి చూడగా అప్పటికే మృతి చెందాడు.