»Wife Refuses To Return Home Husband Commits Suicide In Kesamudram
Kesamudram అత్తామామ, తోడల్లుడి వేధింపులతో భర్త ఆత్మహత్య
వీరందరూ కలిసి తనను అవమానించడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతోపాటు భార్య కాపురానికి రాకుండా పుట్టింట్లోనే ఉండడంతో ఆవేదనకు గురయ్యాడు. తన తోడల్లుడు, వదిన వేధింపులకు గురిచేశారని.. తనను తీవ్రంగా అవమానించాడని కన్నీటి పర్యంతమయ్యాడు.
భార్యాభర్తలు (Wife and Husband) సక్రమంగా ఉంటారు. వారి మధ్య కుటుంబసభ్యులు (Family Members) తలదూరిస్తే మాత్రం ఆ దంపతుల మధ్య విబేధాలు మొదలవుతాయి. సాఫీగా ఉన్న వారి కాపురం (Marriage Life) కుప్పకూలుతుంది. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. తోడల్లుడు, వదిన కలిసి తన భార్యను కాపురానికి పంపించకపోవడంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లాలో (Mahabubabad District) చోటుచేసుకుంది.
కేసముద్రం (Kesamudram) మండలం ధర్మారం పంచాయతీ పరిధిలోని వెంక్యా తండాకు చెందిన బానోతు అశోక్ (24)కు ముత్యాలమ్మతండాకు చెందిన బేబీతో ఏడాది కిందట వివాహమైంది. పెళ్లయినప్పటి నుంచి భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటున్నారు. ఎలాంటి గొడవలు లేవు. గర్భం (Preganancy) దాల్చడంతో కొన్నాళ్లు భర్తతోనే బేబీ ఉంది. అయితే 5 నెలలు నిండడంతో ప్రసవం కోసం పుట్టింటికి పంపించాడు. నాలుగు నెలల కిందట బేబీ పండంటి బాబుకు (Baby Boy) జన్మనిచ్చింది. కొడుకు పుట్టిన ఆనందంలో ఆ దంపతులు మునిగిపోయారు.
కొన్ని రోజుల తర్వాత భార్యను తిరిగి ఇంటికి తీసుకొచ్చేందుకు అశోక్ వెళ్లాడు. అనూహ్యంగా భార్య బేబీ నిరాకరించింది (Refuse). కాపురానికి రానని చెప్పింది. ఈ సమయంలో అశోక్ ను అత్తమామలు వాంకుడోతు సత్రి, ఆనంద్, బేబీ అక్క రజిత, ఆమె భర్త నరేశ్ దూషించారు. వీరందరూ కలిసి తనను అవమానించడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతోపాటు భార్య కాపురానికి రాకుండా పుట్టింట్లోనే ఉండడంతో ఆవేదనకు గురయ్యాడు. దీంతో అశోక్ మే 28వ తేదీన పురుగుల నివారణ మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.
బలవన్మరణానికి పాల్పడక ముందు అశోక్ సెల్ఫీ వీడియో (Selfi Video) తీసుకున్నాడు. ఆ వీడియోలో తన తోడల్లుడు, వదిన వేధింపులకు గురిచేశారని.. తనను తీవ్రంగా అవమానించాడని కన్నీటి పర్యంతమయ్యాడు. వారి కారణంగానే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు వీడియోలో అశోక్ తెలిపాడు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు (Police) పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు.