ఆటోను ఢీకొన్న ప్రైవేటు బస్సు..ఆరుగురు మహిళలు మృతి, మరో నలుగురికి గాయాలు కాకినాడ తాళ్లరేవు బైపాస్ రోడ్డు దగ్గర ప్రమాదం తాళ్లరేవు మండలం సీతారామపురంలోని సుబ్బరాయునిదిబ్బ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది రొయ్యల పరిశ్రమలో పనిచేసి ఆటోలో తిరిగి వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు మృతులు యానాంలోని నీలపల్లికి చెందిన...
మహారాష్ట్రలోని అకోలాలో రెండు గ్రూపుల మధ్య హింసాత్మక ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటన శనివారం రాత్రి జరిగింది. ఘర్షణల్లో ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నాయి. ఎనిమిది మంది గాయపడగా ఒకరు మృతి చెందారు. పోలీసులు పరిస్థితులను అదుపులోకి తీసుకుని… వెంటనే 144 సెక్షన్ విధించారు. అకోలాలోని ఓల్డ్ సిటీ పోలీస్టేషన్ పరిధిలో ఘర్షనలు మొదలైన వెంటనే.. ఆ ప్రాంతానికి భారీగా పోలీసు బలగాలు చేరుకుని ఇరువర్గాలను చెదరగ...
విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. ఏపీలోని నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో ప్రమాదం సంభవించింది. టూరిస్టులు ప్రయాణిస్తున్న పడవ ఆకస్మాత్తుగా బోల్తాపడటంతో 12 మంది మిస్సయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం కావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు లభ్యమైన సంగతి తెలిసిందే. మిగిలిన వారి కోసం అన్వేషణ...
ఈజీ మనీ కోసం ఆశపడ్డ అమ్మాయిలను ఓ తాంత్రికుడు మోసం చేశాడు. అంతేకాదు వారితో నగ్నంగా క్షుద్రపూజలు చేయించాడు. ఆ క్రమంలో డబ్బులు ఇస్తానని చెప్పి అనేక విధాలుగా చీట్ చేశాడు. తర్వాత ఆలస్యంగా మోసపోయామని తెలుసుకున్న యువతులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఈ మధ్య నకిలీ బాబాల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. జనం కూడా పిచ్చి పట్టినట్లు వాళ్లనే నమ్ముతున్నారు. లక్షలు కోట్లు సమర్పించుకుంటున్నారు. ఆ తర్వాత మోసపోయామని గ్రహించి లబోదిబోమంటున్నారు. అలాంటి ఘటనే కేరళలో చోటు చేసుకుంది.
చిన్ననాటి ఫ్రెండ్ నని అన్నాడు... నమ్మించాడు.. కనపడకుండానే 40వేల రూపాయలను కొట్టేశాడు. ఢిల్లీలోని ఓ ఫ్రీ లాన్స్ జర్నలిస్ట్ కు జరిగిన ఘటన ఇది. అయితే తాను హిప్నటైజ్(hipnotize) అవడం వల్లనే డబ్బును కోల్పోయానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ప్రభుత్వ భూములను రక్షించే అధికారులే అక్రమాలకు తెరలేపుతున్నారు. ప్రజలే ప్రభుత్వ భూముల రక్షణకు నడుంకట్టి కలెక్టర్ కు ఫిర్యాదు ఇవ్వడంతో చర్యలను చేపట్టారు మేడ్చల్ కలెక్టర్.
హైదరాబాద్ ఉగ్ర కుట్ర కేసు(Hyderabad terror case) విచారణలో భాగంగా కీలక విషయాలు తెలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఇస్లాం మతం వ్యాప్తితోపాటు ఉగ్ర కుట్ర కోసం నిందితులు మూడంచెల విధానాన్ని అనుసరించారని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాదు ఈ కేసులో నిన్న మరొకరిని అరెస్ట్ చేశారు.
ఏపీలో ఘోరం చోటుచేసుకుంది. పార్వతీపురం జిల్లా భామిని మండలం కాట్రగడ్డ పరిధిలో నాలుగు ఏనుగులు మృత్యువాత చెందాయి. అయితే ఇవి పొలాల్లో పెట్టిన కరెంట్ షాక్ కారణంగా మరణించాయి. ఆ క్రమంలో ట్రాన్స్ ఫార్మర్ ధ్వంసమైందని స్థానికులు చెబుతున్నారు. అయితే ఒడిశా నుంచి మొత్తం ఆరు ఏనుగులు వచ్చాయని, ఈ ప్రమాద ఘటన చూసి మరో రెండు ఏనుగులు తివ్వాకొండ వైపు వెళ్లినట్లు స్థానికులు పేర్కొన్నారు. ఈ ఘటనతో స్థానిక ప్రజలు భయాందో...
కన్యాకుమారిలోని నాగర్‌కోయిల్ సమీపంలో ప్రభుత్వ బస్సు, కారు ఎదురెదురుగా వచ్చి ఆకస్మాత్తుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. 9 మంది గాయాలయ్యాయి. కన్యాకుమారి జిల్లాకు చెందిన నృత్య, పాటల బృందం తిరుచెందూర్ సమీపంలోని ఆలయ కార్యక్రమంలో పాల్గొని ఇంటికి తిరిగి వస్తున్నారు. ఆ క్రమంలో నాగర్‌కోయిల్ నెల్లై జాతీయ రహదారిలోని వెల్లమడం ప్రాంతంలోని వంకలో అనూహ్యంగా ప్రభుత్వ బస్...
ఓ వ్యక్తికి ట్రాఫిక్ చలాన్లు (Traffic Challan) తిప్పలు తెచ్చి పెట్టాయి. ఏకంగా జైలు పాలు చేశాయి. కేరళకు ( Kerala ) చెందని ఓ వ్యక్తి హెల్ మెట్ పెట్టుకోకుండా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించాడు. దీంతో ట్రాఫిక్ సీసీ కెమెరాలు క్లిక్ మనిపించాయి. సదరు వెహికిల్ నెంబర్ అతని భార్య మొబైల్ కు యాడ్ అయి ఉండటంతో మెసేజ్ అతని భార్యకు వెళ్లింది. మెసేజ్ ను గమనించిన అతని భార్య … భర్త వెనక ఓ […]