»Dont Look At A Womans Body Only From A Sexual Perspective Kerala High Court
Kerala High Court: ఆడవారి శరీరాన్ని కేవలం లైంగిక కోణంతో చూడొద్దు
కేరళకు చెందిన ఓ మహిళపై తన అర్ధనగ్న శరీరంపై పిల్లలు పెయింటింగ్ వేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..పెద్ద రచ్చ అయ్యింది. ఈ కేసు చివరకు కేసు కోర్టుకు(Kerala High Court) వెళ్లింది. దీంతో కేరళ హైకోర్టు నగ్నత్వానికి, అశ్లీలతకు తేడా ఉందని కీలక తీర్పునిచ్చింది.
ఒక మహిళ నగ్న శరీరంను ఎల్లప్పుడూ లైంగికంగా లేదా అశ్లీలంగా చూడకూడదని కేరళ హైకోర్టు(Kerala High Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. తన పిల్లలు సెమీ నగ్నంగా పెయింటింగ్‌ను చిత్రీకరించినందుకు ఒక మహిళను క్రిమినల్ కేసు నుంచి విడుదల చేయాలని కేరళ హైకోర్టు పేర్కొంది. శరీరం స్త్రీ గురించి, తన పిల్లల సెక్స్ ఎడ్యుకేషన్ కోసం పితృస్వామ్య భావాలను సవాలు చేసేందుకే తాను ఈ వీడియోను రూపొందించానని తల్లి వివరణను కూడా కోర్టు గుర్తించింది. వీడియోను అశ్లీలంగా పరిగణించలేమని కోర్టు స్పష్టం చేసింది.
కేరళకు చెందిన సామజిక కార్యకర్త రెహనా ఫాతిమా(33)పై పొక్సో, జువైనలల్ యాక్ట్ సహా పలు కేసుల కింద ఆమె విచారణను ఎదుర్కొంది. అందులో భాగంగా ఆమెకు హైకోర్టు విముక్తి కల్పించింది. అయితే రెహనా కొన్నాళ్ల క్రితం సోషల్ మీడియా(social media)లో ఓ వీడియో పోస్ట్ పెట్టారు. అందులో ఆమె అర్ధ నగ్నంగా పడుకుని ఉండగా..ఆమె కుమారుడు, కుమార్తె ఆమె శరీరంపై పెయింటింగ్ వేస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. అయితే ఆ వీడియోపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతోపాటు కేసులు కూడా నమోదయ్యాయి. ఆ నేపథ్యంలో ఆమె ట్రయల్ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం అందుకు ఒప్పుకోకపోవడంతో ఆమె హైకోర్టుకు చేరింది.
ఈ అంశంపై తాజాగా విచారణ జరిపిన కేరళ కోర్టు ఆమె తన శరీరాన్ని(women body) పిల్లల కాన్వాస్ లా ఉపయోగించుకోవచ్చని పేర్కొంది. ఆ క్రమంలో లైంగిక ఉద్రేకాలను ప్రేరెపించే విధంగా లేదని తెలిపింది. దీంతోపాటు పురుషుల పై భాగం నగ్నంగా ఉంటే నగ్నంగా చూడని సమాజం..మహిళల విషయంలో మాత్రం ఎందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించింది. అంతేకాదు మహిళలు తమ శరీరం, జీవితాలపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కూడా ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
మహిళ నగ్న శరీరాన్ని కేవలం లైంగికంగా లేదా అశ్లీలంగా పరిగణించరాదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి క్రమంలో ప్రజలు తమ శరీరాలపై హక్కులను కోల్పోతారని హైకోర్టు(high-count) పేర్కొంది. ఇది సరికాదని తెలిపి మహిళపై అశ్లీలత కేసును హైకోర్టు కొట్టివేసింది. తన పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికే ఈ వీడియో తీశానని ఆమె కోర్టుకు తెలిపింది. వీడియో అసభ్యకరంగా ఉందని చెప్పలేమని హైకోర్టు పేర్కొంది. పురుషుల నగ్న శరీరాల గురించి చాలా అరుదుగా ప్రశ్నలు తలెత్తుతాయని జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ అన్నారు.