»Kerala High Court Ruled That Viewing Pornography Is A Personal Choice
Kerala high court: పోర్న్ వీడియోలు చూడొచ్చు..కానీ
పోర్న్ చూడడం తప్పా కాదా అన్న సందిగ్ధం అనేక మందిలో ఉంటుంది. తాజాగా దీనిపై కేరళ హై కోర్టు కీలక తీర్పునిచ్చింది. పోర్నోగ్రఫీని చూడడం తప్పు కాదని.. అది వారి వ్యక్తిగత విషయమని స్పష్టం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని వెల్లడించింది.
Kerala High Cour: పోర్నోగ్రఫీ(Pornography) అనేది ఇప్పుడు కొత్తగా మానవ జీవితంలోకి చొరబడలేదు. ఎప్పటి నుంచో ఈ ఆచారం సమాజంలో ఉంది. అసలు పోర్న్ చూడడం చట్టరీత్యా నేరమా, కాదా అన్న విషయంలో మాత్రం ఇప్పటికీ ఎవరికీ స్పష్టమైన అవగాహన లేదు. దీనిపై మీడియాల్లో చర్చలు పెట్టినా, పబ్లిక్‌గా వాదించినా కూడా ఒక వర్గం రైట్ అంటారు. మరొక వర్గం రాంగ్ అంటారు. ఇంతకీ చట్టం ఏం చెబుతుందంటే..ఇతరులకు చూపించకుండా, వ్యక్తిగతంగా పోర్నోగ్రఫిక్ ఫొటోలు, వీడియోలు చూడటం నేరం కాదని కేరళ హైకోర్టు(Kerala High Court) తీర్పు(judgment) చెప్పింది. ఇటువంటి చర్యలను నేరంగా పరిగణించలేమని, అది వ్యక్తిగత గోప్యత అని స్పష్టం చేసింది. ఏ ప్రభుత్వం కూడా ఆయా వ్యక్తుల వ్యక్తిగత విషయాల్లో చొరబడటానికి వీలు లేదని తేల్చి చెప్పింది.
2016లో అలువ ప్యాలెస్ వద్ద రోడ్డు పక్కన తన మొబైల్ ఫోన్లో పోర్న్ వీడియోలను చూస్తున్న 33 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 292 ప్రకారం అతనిపై కేసు కూడా నమోదు చేశారు. దీంతో నిందితుడు ఈ అంశంపై కోర్టుకెక్కాడు. ఈ కేసుపై విచారణ చేపట్టిన కేరళ హై కోర్టు కీలక తీర్పు నిచ్చింది. పోర్న్ చూడడం ఆయా వ్యక్తులకు సంబంధింటిన వ్యక్తిగత విషయమని కేరళ బెంచ్ స్పష్టం చేసింది. ఇక కోర్టు చెబుతూ పిల్లలకు ఇంటర్నెట్ ఉన్న మొబైల్‌ను ఇవ్వకూడదని, దాని వలన వారి మైండ్ చెడుకు అలవాటు పడే అవకాశం ఉందని తెలిపింది. పాఠశాలలు లేని సమయంలో క్రికెట్, ఫుడ్ బాల్ లాంటి ఔట్ డోర్ గేమ్స్ ఆడేలా తల్లిదండ్రులు ప్రేరేపించాలని, దాని ద్వారా పిల్లల్లో మానసిక, శారీరక దృఢత్వం ఏర్పడుతుందని కోర్టు పేర్కొంది.
ప్రస్తుత రోజుల్లో స్కూల్ పిల్లలకు మొబైల్స్ ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయి. దీంతో చాలా బోర్డింగ్ స్కూల్స్‌లో ఆన్ లైన్ క్లాసులు కూడా నిర్వహిస్తున్నారు. దీంతో ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న గాడ్జెట్స్ విద్యార్థులు ఉపయోగించడం ఎక్కువైంది. ఇలాంటి క్రమంలో పిల్లలకు ఎక్కువగా ఫోన్లు ఇవ్వకూడదని..దాని ద్వారా వారు అశ్లీల ఫోటోలు, వీడియోలు చూసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో పిల్లలు చదువుపై శ్రద్ధపెట్టేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని కోర్టు సూచించింది. ప్రతి మార్గంలోను తీసుకునే ప్రతి నిర్ణయంలో మంచి చెడు రెండు మార్గాలు ఉంటాయన్నారు. అందులో మనం ఎంచుకున్న మార్గాన్ని బట్టే మన భవిష్యత్తు ఉంటుందనేది ధర్మాసనం వెల్లడించింది.