»Odisha Train Accident A Father Who Traveled 230 Kilometers To Save His Son
Odisha Train Accident: 230 కిలోమీటర్లు ప్రయాణం చేసి కొడుకును కాపాడుకున్న తండ్రి
ఎక్కడా తన కొడుకు బిశ్వజిత్ ఆచూకీ లభించలేదు. ఇక కొడుకును తలచుకుని కన్నీళ్లతో మృతదేహాలు ఉంచిన ప్రాంతానికి వెళ్లాడు. తన కొడుకు చనిపోయి ఉండడనే నమ్మకంతో గుండెను రాయి చేసుకుని అక్కడ కూడా వెతికాడు. అక్కడే చలనంతో ఉన్న తన కొడుకు బిశ్వజిత్(Biswajith) కనిపించాడు.
ఒడిశా రైలు ప్రమాద(Odisha Train Accident) ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో 288 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. చాలా మంది గాయాలపాలై చికిత్స తీసుకుంటున్నారు. అందులో ఓ యువకుడు ప్రమాద ఘటనా స్థలం నుంచి తన తండ్రికి ఫోన్ చేశాడు. తాను ఎటూ కదలలేని స్థితిలో ఉన్నానని, కాపాడమని వేడుకున్నాడు. బిడ్డ మాటలకు కంటనీరు కార్చుతూనే ఆ తండ్రి 230 కిలోమీటర్లు ఆగకుండా అంబులెన్స్‌లో ప్రయాణించాడు. చివరికి తన కొడుకును కాపాడుకున్నాడు.
పశ్చిమబెంగాల్లోని హౌరా జిల్లాకు చెందిన హేలరామ్ మాలిక్(Helaram Maalik)కు బిశ్వజిత్(Biswajith) అనే 24 ఏళ్ల కొడుకున్నాడు. కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌లో రైలు ప్రమాదం(Odisha Train Accident)లో బిశ్వజిత్ సైతం గాయపడ్డాడు. ఆ సమయంలో అతను తన తండ్రికి ఫోన్ చేసి చెప్పగా తన బావ దీపక్ దాస్‌తో కలిసి హేలరామ్ అంబులెన్స్‌తో కొడుకు కోసం బయలుదేరాడు. 230 కిలోమీటర్లు ప్రయాణించి బాలాసోర్ లోని ప్రమాద స్థలానికి చేరుకున్నాడు. కొడుకు కోసం వెతికితే కనపడలేదు.
చికిత్స అందిస్తున్న ఆస్పత్రి(Hospital)లో వెతికాడు. అక్కడ కూడా కనిపించలేదు. వైద్యులను, ఇతరులను అడిగాడు. మరో ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. అక్కడికి కూడా పరుగెత్తుకుని వెళ్లి తన బిడ్డను వెతికాడు. ఎక్కడా తన కొడుకు బిశ్వజిత్ ఆచూకీ లభించలేదు. ఇక కొడుకును తలచుకుని కన్నీళ్లతో మృతదేహాలు ఉంచిన ప్రాంతానికి వెళ్లాడు. తన కొడుకు చనిపోయి ఉండడనే నమ్మకంతో గుండెను రాయి చేసుకుని అక్కడ కూడా వెతికాడు. అక్కడే చలనంతో ఉన్న తన కొడుకు బిశ్వజిత్(Biswajith) కనిపించాడు. వెంటనే అతన్ని అంబులెన్స్‌లోని తీసుకుని చికిత్స చేశారు. ప్రస్తుతం బిశ్వజిత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రాణాపాయం లేదు. కొడుకును బతికించుకునేందుకు ఆ తండ్రి చేసిన సాహసానికి అందరూ సలాం చేస్తున్నారు.