»Odisha Train Accident Two Families Of Bhagalpur Claim A Dead Body Dna Test Started
Odisha Train Accident: మృతదేహాల అప్పగింతలో గందరగోళం.. ఒడిశా ప్రభుత్వం సంచలన నిర్ణయం
బాలాసోర్ రైలు ప్రమాదం(Balasore Train Accident)లో ప్రాణాలు కోల్పోయిన కొందరు ప్రయాణికుల మృతదేహాలకు డీఎన్ఏ పరీక్ష(DNA test) నిర్వహించాలని ఒడిశా ప్రభుత్వం(Odisha govt) నిర్ణయించింది.
Odisha Train Accident: బాలాసోర్ రైలు ప్రమాదం(Balasore Train Accident)లో ప్రాణాలు కోల్పోయిన కొందరు ప్రయాణికుల మృతదేహాలకు డీఎన్ఏ పరీక్ష(DNA test) నిర్వహించాలని ఒడిశా ప్రభుత్వం(Odisha govt) నిర్ణయించింది. మృత దేహాలను గుర్తించి, నకిలీ హక్కుదారులను అరికట్టేందుకు ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. సోమవారం నుండే కొన్ని అనుమానాస్పద మృతదేహాలను నిజమైన బంధువులకు అప్పగించే ముందు DNA నమూనాలను తీసుకున్నారు. శుక్రవారం జరిగిన రైలు ప్రమాదంలో మొత్తం 278 మంది ప్రయాణికులు మరణించారు.
బీహార్‌లోని భాగల్పూర్కు చెందిన రెండు వేర్వేరు కుటుంబాలు సోమవారం ఒకే మృతదేహం తమదంటే తమదని వాదన చేయడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. రెండు కుటుంబాలు ఒకే మృతదేహాన్ని తమవిగా పేర్కొంటూనే ఉన్నాయి. మృతదేహం ఛిద్రమైన స్థితిలో ఉండడంతో గుర్తించడంలో అధికారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో అటువంటి అనుమానాస్పద మృతదేహాలను వారి బంధువులకు అప్పగించే ముందు రాష్ట్ర ప్రభుత్వం DNA పరీక్షను నిర్వహించాలని నిర్ణయించింది.
ఒకే మృతదేహంపై రెండు వేర్వేరు కుటుంబాలు చేస్తున్న ఆరోపణలకు సంబంధించి, ఇప్పుడు వారి DNA పరీక్ష జరిగే వరకు అనుమానాస్పద మృతదేహాలను అప్పగించబోమని అధికారి తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి రైల్వేశాఖ, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందిన నష్టపరిహారం కారణంగా కొందరు మృతదేహాలపై తప్పుడు వాదనలు కూడా పెట్టే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. వాస్తవానికి రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వంతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారం ప్రకటించాయి. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ప్రయాణికుల కుటుంబాలకు రైల్వే శాఖ ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.
మరోవైపు, బాధితుల కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి రూ.2లక్షలు, మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల నష్టపరిహారం పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందజేయనున్నట్లు తెలిపారు. ఈ విధంగా చూస్తే ఒడిశాకు చెందిన ఓ ప్రయాణికుడు ప్రమాదంలో చనిపోతే అతని కుటుంబానికి మొత్తం రూ.17 లక్షలు అందుతాయి. పశ్చిమ బెంగాల్లోనూ అదే పరిస్థితి. అయితే ఇప్పటి వరకు బీహార్ ప్రభుత్వం ఎలాంటి పరిహారం ప్రకటించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో బీహార్ బాధిత కుటుంబాలకు రూ.12 లక్షలు అందుతాయి. బీహార్‌కు చెందిన 25 మంది ప్రయాణికులు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోగా, చాలా మంది గాయపడినట్లు చెబుతున్నారు. బీహార్‌లోని అనేక కుటుంబాలు కూడా తమ ప్రియమైన వారిని వెతుక్కుంటూ భువనేశ్వర్, బాలాసోర్‌లోని ఆసుపత్రులకు చేరుకున్నాయి.