ఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor scam) కేసులో సరికొత్త పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిపోయారు. అయితే శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారేందుకు ఢిల్లీ రౌస్ అవిన్యూ కోర్టు ఒప్పుకున్నట్లు తెలిసింది. ప్రస్తుతం నిందితుడు శరత్ చంద్రారెడ్డి బెయిల్ పై ఉన్నారు. వివిధ సంస్థలు, వ్యక్తులతో సిండికేట్ చేసుకుని డబ్బులు దోచుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనే అభియోగాలు శరత్ చంద్రారెడ్డిపై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ గతంలో శరత్ ను అదుపులోకి తీసుకుని పలు మార్లు ప్రశ్నించింది.