తమిళనాడు జల్లికట్టులో మరో విషాదం జరిగింది. ధర్మపురిలో జల్లికట్టును వీక్షించేందకు వచ్చిన ఓ బాలుడు మృతిచెందాడు. జల్లికట్టును ను చూసేందుకు గోకుల్ అనే 14 ఏళ్ల బాలుడు తన ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాడు. అయితే వేగంగా దూసుకొచ్చిన ఎద్దు గోకుల్ ను కడుపులో పొడిచింది. దీంతో ఆ బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు బాలుడ్ని ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది. అప్పటికే బాలుడు మృతిచెందినట్లు వైద్యులు ...
ఉద్యోగం కోసం ఐఏఎస్ అధికారిణిని ప్రసన్నం చేసుకునేందుకు డిప్యూటీ తహసీల్దార్ సాహసానికి ఒడిగట్టారు. జూబ్లీహిల్స్ ప్రాంతంలో సంపన్నులు ఉండే ఓ గేటెడ్ కమ్యూనిటీలోకి దూసుకెళ్లాడు. అర్ధరాత్రి మహిళా ఐఏఎస్ ఇంట్లోకి దూరిపోయాడు. భయపడిపోయిన అధికారిణి కేకలు వేయడంతో కలకలం రేగింది. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం...
సోషల్ మీడియాను యువత దుర్వినియోగ పరుస్తోంది. అవసరాలకు వాడుకోకుండా అసాంఘిక కార్యక్రమాలకు వినియోగిస్తోంది. దీని పర్యావసనాలు దారుణంగా ఉంటున్నాయి. ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు సోషల్ మీడియాలో అమ్మాయితో చేసిన వీడియో కాలింగ్ ద్వారా సినిమా రేంజ్ లో కట్టు కథ అల్లాడు. చివరికి కన్న తండ్రినే మోసం చేశాడు. ఇప్పుడు కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఆ ఘటనలో ...
టీమిండియా బౌలర్ ఉమేశ్ యాదవ్ ను స్నేహితుడు నిండా ముంచేశాడు. ఆస్తి కొనుగోలు పేరుతో మోసం చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కొరాడి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నాగ్‌పూర్‌లోని శివాజీ నగర్‌కు చెందిన 35 ఏళ్ల ఉమేశ్ యాదవ్ 2014లో శైలేశ్ దత్త ఠాక్రే అనే స్నేహితుడిని మేనేజర్‌గా నియమించుకున్నాడు. తన ఆర్థిక వ్యవహారాలు చూసుకునేందుకు స్నేహితుడిని నియమించుకున్నాడు. అయితే, ఏడాది కాలంగా శైలేశ్ ఆ వ్యహారాలను...
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ పై మరో నటి నోరా ఫతేహి పరువునష్టం దావా వేసింది. మనీలాండరింగ్ కేసులో తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని నోరా ఫతేహి కోర్టును ఆశ్రయించింది. దీంతో ఢిల్లీ కోర్టులో జాక్వెలిన్ పై క్రిమినల్ కేసు నమోదైంది. తన గౌరవప్రతిష్టలు భంగపరిచి, సినీ కెరీర్ ను దెబ్బ తీసిందని నోరా ఫతేహి ఫిర్యాదులో తెలిపింది. అంతేకాకుండా నోరా ఫతేహిని కించపరుస్తూ వార్తలు రాసిన 15 మీడియా సంస్థలపై కూడా కేసు వేసింది...
ఓ మహిళ కారుతో యువకుడిని ఢీకొట్టడంతో పాటు దాదాపు కిలోమీటర్ వరకు ఈడ్చుకుంటూ వెళ్లింది. కర్ణాటకలోని బెంగళూరులో శుక్రవారం ఈ ఘటన జరిగింది. అంతకుముందు మెయిన్‌రోడ్‌పై బాధిత యువకుడి కారు.. నిందితురాలు ప్రియాంక వాహనం ఢీకొట్టుకున్నాయి. దీంతో కారు దిగి మహిళను నిలదీసేందుకు బాధితుడు ప్రయత్నించాడు. ఒక్కసారిగా అవేశానికి లోలైన ప్రియాంక.. అతడ్ని కారుతో ఢీకొట్టింది. వెంటనే అప్రమత్తమైన ఆ వ్యక్తి.. కారు బ్య...
ఇఫ్లూలో దారుణం జరిగింది. యూనివర్సిటీ క్యాంపస్ లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. బిల్డింగ్ నాల్గో అంతస్తు నుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. తలకు బలమైన గాయం కావడంతో స్పాట్ లోనే చనిపోయింది. మృతురాలిని హర్యానాకు చెందిన అంజలిగా గుర్తించారు. ఆమె ఎంఏ ఇంగ్లీష్ సెకండ్ ఇయర్ చదువుతోంది. కుటుంబ కలహాల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.విద్యార్థిని ఆత్మహత్యపై స్టూడెంట్ యూనియన్ లీడర్స్ ఆరోపణ...
విద్యుత్ ఉపకరణాలను జాగ్రత్తగా వినియోగించాలి. వాటిపట్ల ఏమాత్రం నిర్లక్ష్యం వహించిన పెను ప్రమాదాలు సంభవిస్తాయి. వాషింగ్ మెషీన్ ఇద్దరి ప్రాణం మీదకు వచ్చింది. ప్రస్తుతం వారు కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నారు. పేలుడు ధాటికి ఇల్లు ధ్వంసమవగా.. మంటలు వ్యాపించాయి. ఇంటి బయట పార్క్ చేసిన కారు కూడా పగిలిపోయింది. ఈ ఘటన తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్ క...
మూఢనమ్మకాల చాటున మానవులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. అతీత శక్తులు ఉన్నాయంటూ దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఘోర సంఘటన జరిగింది. పిల్లలు పుట్టడం లేదని ఓ మహిళకు ఆమె భర్త, అతడి కుటుంబసభ్యులు అస్థికలు తినిపించారు. క్షుద్ర పూజలు నానా బీభత్సం సృష్టించారు. ఆ బాధలకు తాళలేక బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించింది. మహారాష్ట్రలోని సింహగడ్ పోలీసుల వివరాల ప్రకారం.. పుణెలోని ధైరీ ప్రాంతంలో నివసిస్త...
హైదరాబాద్ లో అక్రమ కట్టడాల విషయంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు మంత్రి తలసాని. ఈ నెల 25న కమిటీ సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి తలసాని తెలిపారు. నగరంలోని నల్లగుట్టలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనను అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వ విభాగాలన్నీ యుద్ధ ప్రాతిపదికన స్పందించాయన్నారు. ప్రమాదం జరిగిన భవనంలో కెమికల్స్ ఉండటం వల్ల మంటలు తొందరగా అదుపులోకి రాలేదని ఆయన తెలిపారు. పక్కన ఉన్న బస్తీకి మంట...
సికింద్రాబాద్ వద్ద షాపింగ్‌మాల్‌లో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు షార్ట్ సర్య్కూట్ కారణం కాదని విద్యుత్ శాఖ అధికారి శ్రీధర్ వెల్లడించారు. షార్ట్ సర్య్కూట్ జరిగుంటే విద్యుత్ సబ్ స్టేషన్‌లో ట్రిప్ అయ్యేదని, కానీ అలా జరగలేదని తెలిపారు. గురువారం ఉదయం 11.20 గంటలకు సమాచారం అందగానే విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు తెలిపారు. చుట్టుపక్కల కాలనీలకు సాయంత్రం 6.30 గంటలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లుగా ...
గోవా- ముంబయి హైవే పై గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక చిన్నారి సహా 9మంది ప్రాణాలు కోల్పోయారు. జాతీయ రహదారి పై రాయగఢ జిల్లాలోని మంగాన్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న కారు, ట్రక్కు ఒకదానిని మరొకటి ఢీకొన్నాయి. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఈ దుర్ఘటనలో 9మంది మరణించగా.. నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన బా...
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం బీజేపీ నేత బండి సంజయ్ కుమారుడు భగీరథ్ హాట్ టాపిక్ గా మారారు. భగీరథ్ కాలేజీలో తోటి విద్యార్థిని కొడుతూ.. బెదిరిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అది కాస్తా పోలీసులకు చేరింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భగీరథ్ ని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలిసిన పలు రాజకీయ పార్టీల నేతలు బండి సంజయ్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. ఆర్జీవీ సైతం భగీరథ్ ని నియం...
భారత అంతరిక్ష ప్రయోగాలకు కీలక కేంద్రంగా ఉన్న శ్రీహరికోటలోని షార్ లో వరుస ఆత్మహత్యలు అలజడి రేపుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో ముగ్గురు బలవన్మరణానికి పాల్పడడం విషాదం కలిగించింది. ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం (షార్)లో ఈ నెల 15, 16, 17వ తేదీల్లో రోజుకొకరు చొప్పున ముగ్గురు తమ ప్రాణాలను బలి తీసుకున్నారు. వివిధ కారణాలతో వారు ఆత్మహత్యలు చేసుకున్నారు. అఘాయిత్యానికి ప...
అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం రెండో పెళ్లి చేసుకున్నాడు. గతేడాది సెప్టెంబర్ నెలలో ఆయన పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని దావూద్ సోదరి హసీనా పార్కర్ కుమారుడు అలీషా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ) అధికారులకు తెలియజేశాడు. ఆయన తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకముందే …పాకిస్తాన్ కి చెందిన మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. టెర్రర్ ఫండింగ్ కేసులో భాగంగా దావూద్ ఇబ్రహీంపై గతంలో కేసు నమోదు చేస...