A Shruthi Story: మసాజ్ ముసుగులో వ్యభిచారం.. డాక్టర్ కావాలనుకొని దారిమళ్లింది
డాక్టరై జనం నాడీ పట్టుకోవాల్సిన శృతి.. ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కింది. మసాజ్ సెంటర్ ఏర్పాటు చేసి వ్యభిచారం చేయించింది. ఫస్ట్ టైమ్ అరెస్టై జైలుకు వెళ్లొచ్చిన ఆమెలో మార్పు రాలేదు. తాజాగా మరొసారి పట్టుబడింది.
A Shruthi Story: డాక్టర్ కావాలని అనుకుంది.. ఉక్రెయిన్ వెళ్లి మరీ ఎంబీబీఎస్ చేసింది. ఫస్ట్ ఇయర్ ఎలాగోలా గడిచింది. సెకండ్ ఇయర్ వచ్చింది. ఇంతలో డబ్బులు సర్దుబాటు కాలేదు. ఫీజు చెల్లించలేని పరిస్థితి చెసేదెమీ లేక ఇండియాకు వచ్చేసింది. ఇక్కడ ఎయిర్ హోస్టెస్ ట్రైనింగ్ తీసుకుంది. అదీ వర్కవుట్ కాలేదు. ఈజీ మనీ ఎలా సంపాదించాలని ఆలోచించింది. మసాజ్ సెంటర్ ఏర్పాటు చేసింది. అక్కడ చేయించేది వ్యభిచారం.. ఇదీ శృతి (Shruthi) చేస్తోన్న పని. ఫస్ట్ టైమ్ పంజాగుట్ట పోలీసులకు చిక్కి.. జైలుకు కూడా వెళ్లొచ్చింది. అయినా మార్పు రాలేదు. ఇప్పుడు రెండోసారి పట్టుబడింది.
రిసెప్షనిస్ట్
భద్రాచలానికి చెందిన శృతికి (Shruthi) ఇక్కడ ఎంబీబీఎస్ (mbbs) సీటు రాలేదు. ఉక్రెయిన్‌లో మెడిసిన్ చేసేందుకు వెళ్లింది. ఫస్ట్ ఇయర్ నెట్టుకొని వచ్చింది. ఆర్థిక ఇబ్బందుల వల్ల సెకండ్ ఇయర్ చేయడం కాలేదు. స్వదేశానికి తిరిగి వచ్చింది. ఇక్కడికి వచ్చి చదువలేదు.. జాబ్ చేయలేదు. ఎయిర్ హోస్టెస్‌గా ట్రైనింగ్ తీసుకుంది. అదీ వర్కవుట్ కాలేదు. బంజారాహిల్స్‌లో స్టార్ హోటల్లో రిసెప్షనిస్ట్‌గా పనిచేసింది. ఆ తర్వాత శృతి వైఖరిలో మార్పు కనిపించింది. ఈజీగా మని సంపాదించాలని అనుకుంది.
అరెస్ట్.. జైలుకు వెళ్లి
మసాజ్ సెంటర్ పెట్టాలని అనుకుంది. పంజాగుట్టలో (punjagutta) పెట్టేసింది. అక్కడ క్రాస్ మసాజ్ చేయించింది. ఓ సారి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె వైఖరిలో మార్పు రాలేదు. తర్వాత బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో పర్పుల్ నేచురల్ హెల్త్ త్రూ ఆయుర్వేద స్పా అని పేరు పెట్టింది. ఇక్కడ కూడా వ్యభిచారం జరుగుతుందని పోలీసులకు తెలిసింది. నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం రాత్రి దాడులు నిర్వహించారు. 10 మంది యువతులు, 8 మంది విటులు పట్టుబడ్డారు. యువతులను రెస్క్యూ హోమ్‌కు తరలించారు. నిర్వాహకులు శృతి సహా మరో ఇద్దరినీ అరెస్ట్ చేసి బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. వీరిని రిమాండ్‌కు తరలించారు.
మరోసారి అరెస్ట్
శృతికి (Shruthi) రమణ, జాహెద్ అనే ఇద్దరు తోడుగా ఉన్నారు. వేర్వేరు ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి.. ఇక్కడ పనిలో పెట్టేవారు. వారితో పాడు పని చేయించేవారు. పొట్ట కూటి కోసం వారికి ఆ పని చేయడం తప్పలేదు. పోలీసుల దాడులతో విముక్తి కలిగింది. డాక్టర్ అయి ప్రజల నాడీ పట్టాల్సిన శృతి.. అమ్మాయిలతో క్రాస్ మసాజ్ చేయించి.. మరోసారి కటకటలా పాలయ్యింది.