విద్యుత్ వైరును దొంగిలించారనే ఆరోపణపై పోలీసులు కొందరు దుర్మార్గులను వెంబడించారు. ఇంతలో పోలీసులను చూసి ఓ దుండగుడు ఫ్లై ఓవర్‌పై నుంచి దూకాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. నేరస్థుడిని ఆసుపత్రిలో చేర్చారు, కాని వైద్యులు అతని ప్రాణాలను రక్షించలేకపోయారు.
టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు రోజుల పాటు ఆయన్ని పోలీసులు విచారించారు. విచారణలో ఆయన మొత్తం 12 మంది పేర్లను బయటపెట్టారు. దీంతో టాలీవుడ్ సెలబ్రిటీలలో టెన్షన్ మొదలైంది.
ఇద్దరు విద్యార్థులు తమ ట్యూషన్ టీచర్ పై తుపాకీతో కాల్పులు జరిపారు. గత కొన్ని రోజులుగా పెండింగ్ ట్యూషన్ ఫీజును చెల్లించమంటూ టీచర్ అడగటంతో విద్యార్థులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. ప్రస్తుతం కాల్పులకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పింక్ వాట్సాప్(Pink Whatsaap) పేరుతో సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండే వారినే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. పాత దానికి అప్ గ్రేడ్ వర్షన్ అని ఇందులో బోలెడన్ని ఆప్షన్లు ఉన్నాయని కేటుగాళ్లు ఊదరగొడతారు.
టైటానిక్ షిఫ్ శకలాలు చూసేందుకు వెళ్లిన ఐదుగురు పర్యాటకులు జల సమాధి అయ్యారు. టైటాన్ సబ్ మెర్సిబుల్ తీవ్ర ఒత్తిడికి గురై పేలిపోయిందని అమెరికా కోస్ట్ గార్డ్ ధృవీకరించింది.
మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఏ1, ఏ2 నిందితులుగా రామోజీరావు, శైలజా కిరణ్ లను గుర్తిస్తూ సీఐడీ నోటీసులిచ్చింది. జులై 5వ తేదిన వారు గుంటూరులో విచారణకు రావాలని కోరింది.
గేట్ ఇంజినీరింగ్ కాలేజీ సెక్రటరీ కాంతారావుపై హత్యాయత్నం జరిగింది. కాలేజీ పార్ట్‌నర్స్ తనను చంపేందుకు సుఫారీ ఇచ్చారని కోదాడ పోలీసులకు కాంతారావు ఫిర్యాదు చేశారు.
కేరళలో ఓ వ్యక్తి జడ్జీ కారుపై తన ప్రతాపం చూపించాడు. తన విడాకుల కేసులో వాదనలు వినడం లేదని ఆగ్రహాంతో ఊగిపోయాడు. కోర్టు బయట కనిపించిన కారు అద్దాలు పగలగొట్టి తన కోపాన్ని తీర్చుకున్నాడు.
గ్వాలియర్‌లో కదులుతున్న రైలులో ఓ మహిళపై ఐదుగురు దుండగులు అత్యాచారానికి ప్రయత్నించారు. ఇందులో విఫలమవడంతో మహిళతో పాటు ఆమె బంధువును రైలు నుంచి కిందకు తోసేశారు.
బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద కత్తిపోట్ల కలకలం అధికారుల వైఫల్యంతో మందు బాబులు, పాత నేరస్థుల హల్ చల్ కత్తులతో పరస్పరం దాడి చేసుకున్న పలువురు, ఒకరి పరిస్థితి విషమం ఆలయానికి పెద్ద ఎత్తున తరలి వచ్చిన స్థానిక భక్తులు భారీగా భక్తులు వస్తారని తెలిసినా కూడా ఏర్పాట్లలో నిర్లక్ష్యం వహించారని భక్తుల ఆగ్రహం మరోవైపు పోలీసులు కేవలం వీఐపీ భద్రతపైన ఫోకస్ పెట్టారని విమర్శలు ఏర్పాటు కూడా పోలీసులు, అధికారులు తూతూ మం...
తెలంగాణలో బీఆర్ఎస్(BRS) నేతలపై వస్తున్న లైంగిక వేధింపులు క్రమంగా పెరుగుతున్నాయి. మొన్న జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే టీ రాజయ్యపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూడా ఓ యువతిని లైంగికంగా వేధించాడని వెలుగులోకి వచ్చింది. తాజాగా బోధన్లో ఏకంగా బీఆర్ఎస్ నేత ఓ 13 ఏళ్ల బాలికపై అత్యచారం చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.