»Breaking The Investigation In The Drug Case Ended Kp Named 12 Names
Breaking : డ్రగ్స్ కేసులో ముగిసిన విచారణ..12 పేర్లు చెప్పిన కేపీ
టాలీవుడ్ నిర్మాత కేపీ చౌదరిని డ్రగ్స్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో రెండు రోజుల పాటు ఆయన్ని పోలీసులు విచారించారు. విచారణలో ఆయన మొత్తం 12 మంది పేర్లను బయటపెట్టారు. దీంతో టాలీవుడ్ సెలబ్రిటీలలో టెన్షన్ మొదలైంది.
డ్రగ్స్ కేసులో కబాలి సినిమా నిర్మాత కేపీ చౌదరి(KP Choudary)ని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కేపీ చౌదరి అరెస్ట్ తో సినీ ఇండస్ట్రీ(Cine Industry)లో కలకలం రేగింది. కేపీ చౌదరి గోవా నుంచి తీసుకొచ్చిన 100 ప్యాకెట్ల కొకైన్లో 90 ప్యాకెట్లు మాత్రమే పోలీసులకు దొరికాయని మరో 10 ప్యాకెట్లు ఎవరికి అమ్మారనే దానిపై పోలీసులు ఆరా తీశారు. అంతేకాకుండా కేపీ చౌదరికి టాలీవుడ్(Tollywood)లో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా విచారించారు.
పోలీసుల విచారణలో తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన నలుగురు హీరోయిన్స్, ఇద్దరు నిర్మాతలకు కేపీ చౌదరితో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే విచారణలో మొత్తం 12 మంది పేర్లను ఆయన బయటపెట్టినట్లు సమాచారం. తాను సినిమా వాళ్లకు ఎవ్వరికీ డ్రగ్స్ సప్లై చేయలేదని కేపీ చౌదరి(KP Choudary) విచారణలో స్పష్టం చేశారు.
తాను డ్రగ్స్(Drugs) తీసుకుంటానని ఆయన పోలీసుల వద్ద ఒప్పుకున్నారు. పట్టుబడిన డ్రగ్స్ తన కోసమే తెచ్చుకున్నట్లు స్పష్టం చేశాడు. తన ఫోన్లో సెలబ్రెటీల ఫొటోలు ఉన్నాయని, అంతమాత్రాన వారికి సప్లై చేసినట్లు కాదని వెల్లడించారు. రెండు రోజుల పాటు కేపీ చౌదరి(KP Choudary)ని విచారించిన పోలీసులు రంగారెడ్డి కోర్టులో ఆయన్ని హాజరుపరిచారు. విచారణలో ఆయన షాకింగ్ విషయాలు చెప్పారు. దీంతో ఆయనతో పరిచయం ఉన్నవారిలో గుబులు రేగుతోంది.