గ్వాలియర్‌లో కదులుతున్న రైలులో ఓ మహిళపై ఐదుగురు దుండగులు అత్యాచారానికి ప్రయత్నించారు. ఇందులో విఫలమవడంతో మహిళతో పాటు ఆమె బంధువును రైలు నుంచి కిందకు తోసేశారు.
Madhya Pradesh:మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. గ్వాలియర్‌లోని బిలువా పోలీస్ స్టేషన్ పరిధిలో ముజఫర్‌పూర్ సూరత్ ఎక్స్‌ప్రెస్ రైలు నుండి ఒక మహిళ, ఆమె బంధువును ఐదుగురు దుండగులు కిందకు తోసేశారు. దుండగులు ఈ ఘటనకు పాల్పడినప్పుడు రైలు నడుస్తోంది. దుండగులు మద్యం మత్తులో ఉన్నారని మహిళ, ఆమె బంధువు ఆరోపిస్తున్నారు. వారు బలవంతంగా వారిపై అశ్లీల వీడియోలు తీశారు. ఆ తర్వాత దుండగులు మహిళపై అత్యాచారానికి ప్రయత్నించారు. కానీ మహిళ, ఆమె బంధువు నిరసన వ్యక్తం చేసింది. దుండగులు మహిళ, ఆమె బంధువును కొట్టి, కదులుతున్న రైలు నుండి కిందకు విసిరారు. ఈ ఘటనలో మహిళతో పాటు మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటనలో రాత్రి కుండపోతగా వర్షం కురుస్తుండడంతో మహిళ, ఆమె బంధువు రక్తస్రావమైన స్థితిలో సమీప గ్రామానికి చేరుకుని అక్కడి గ్రామస్థులకు తమ బాధను వివరించారు. ఆ తర్వాత డయల్ 100 సహాయంతో గ్రామస్థులు మహిళను, ఆమె బంధువును జైరోగ్య ఆసుపత్రిలోని ట్రామా సెంటర్లో చేర్పించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. బంధువుతో కలిసి గుజరాత్ వెళ్తున్నట్లు బాధిత మహిళ చెబుతోంది. ఆమెకు 5 మంది పిల్లలు, భర్త కూడా లేడు. గ్వాలియర్ క్రాస్ వద్ద రాత్రి 11 గంటల సమయంలో దుండగులు వేధించడం ప్రారంభించిన సమయంలో ఆమె తన బంధువుతో కలిసి గుజరాత్లో కూలీ పనికి వెళ్తోంది. దుండగులు అకస్మాత్తుగా మహిళను వీడియో తీయడం ప్రారంభించారు. దీనిపై మహిళ, ఆమె బంధువు నిరసన తెలపడంతో అగంతకులు వారిపై దౌర్జన్యానికి దిగారు.. దుండగుల నుంచి తప్పించుకునేందుకు మహిళ, ఆమె బంధువు దగ్గరకి వెళ్లి కూర్చున్నారు. అయితే ఇక్కడ కూడా అగంతకులు ఆమెను వెంబడించడం మానలేదు. దుండగులు ఆమె బట్టలు లాగి అత్యాచారం చేయాలనుకున్నారు, ప్రస్తుతం పోలీసులు మహిళ వాంగ్మూలాల ఆధారంగా 3 గుర్తు తెలియని దుండగులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారి కోసం వెతకడం ప్రారంభించారు.