»Titan Submersible Crew Dead Confirms Us Coast Guard
Titan Submersible పేలడంతో ఐదుగురు పర్యాటకుల మృతి
టైటానిక్ షిఫ్ శకలాలు చూసేందుకు వెళ్లిన ఐదుగురు పర్యాటకులు జల సమాధి అయ్యారు. టైటాన్ సబ్ మెర్సిబుల్ తీవ్ర ఒత్తిడికి గురై పేలిపోయిందని అమెరికా కోస్ట్ గార్డ్ ధృవీకరించింది.
Titan Submersible Crew Dead Confirms US Coast Guard
Titan Submersible: టైటానిక్ షిఫ్ శకలాలను చూసేందుకు వెళ్లి గల్లంతైన టైటాన్ సబ్ మెర్సిబుల్ (Titan Submersible) తీవ్ర ఒత్తిడికి గురై పేలిపోయింది. అందులో ఉన్న ఐదుగురు పర్యాటకులు చనిపోయారని అమెరికా కోస్ట్ గార్డ్ (coast guard) ధృవీకరించింది. టైటాన్ మినీ సబ్ మెరైన్లో స్టాక్టన్ రష్, షెహ్జాద్ దావూద్, సులేమాన్ దావూద్, హమీష్ హర్డింగ్, పాల్ హెన్రీ నార్గెలెట్ వెళ్లారు.
అట్లాంటిక్ మహా సముద్రంలో 12 వేల అడుగుల లోతులో టైటానిక్ శకలాలను ఉన్న సంగతి తెలిసిందే. వాటిని చూసేందుకు టూరిస్ట్ సంస్థ ఓషియన్ గేట్ ‘టైటాన్ సబ్ మెర్సిబుల్’ పంపగా ఆదివారం రాత్రి నుంచి సమాచారం లేదు. అమెరికా (us), కెనడా (canada) రక్షణ బృందాలు అలర్ట్ అయ్యాయి. టైటాన్ ఆచూకీ కనుగొనేందుకు గాలింపు చర్యలు చేపట్టాయి. 13 వేల అడుగుల లోతులో ఉన్న మినీ జలాంతర్గామి చప్పుళ్లు వినేందుకు సోనార్లను జారవడిచారు. పీ-8 నిఘా, సీ-130 రవాణా విమానాలను రంగంలోకి దింపారు.
గల్లంతైన సబ్ మెర్సిబుల్ (Submersible) తీవ్ర ఒత్తిడి వల్ల పేలిపోయిందని. .అందులో ఉన్న ఐదుగురు పర్యాటకులు చనిపోయారని అమెరికన్ కోస్ట్ గార్డ్ ప్రకటన చేసింది. సాహసయాత్రలో వెళ్లిన ఒక్కో పర్యాటకుడి నుంచి రూ.2 కోట్లు తీసుకున్నారు. వారి యాత్ర విషాదాంతంగా మారింది. టైటాన్ను (titan) వెతికేందుకు సముద్ర గర్బంలోకి పంపించిన రిమోట్ ఆపరేటెడ్ వెహికిల్ సాయంతో మునిగిన టైటానికి నౌక సమీపంలో కొన్ని శకలాలను గుర్తించారు. టైటానిక్ ఓడ (titanic ship) సమీపంలో 488 మీటర్ల దూరంలో టైటాన్ శకలాలు ఉన్నాయని పేర్కొన్నారు.