Techie Suicide: హైదరాబాద్‌లో ఓ టెకీ సూసైడ్ (Techie Suicide) చేసుకుంది. భర్త వేధింపులు బరించలేక బలవన్మరణానికి పాల్పడింది. ఫేస్బుక్లో లైవ్ పెట్టి మరీ సూసైడ్ చేసుకుంది. ఉరి వేసుకోవడానికి కన్నా ముందు కూడా తెలుగు, హిందీలో మాట్లాడింది. ఏడుస్తూనే.. భర్త గురించి చెప్పింది. తన కుమారుడిని భర్తకు ఇవ్వొద్దని వివరించింది. ఆ వీడియో చూసిన వారు కంటతడి పెట్టారు.
వివాహిత పేరు సన (sana).. ఐదేళ్ల క్రితం హేమంత్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. సన స్వస్ధలం రాజస్థాన్.. అంతకుముందు అక్కడే జాబ్ చేసే వారు. 5 నెలల క్రితం హైదరాబాద్ వచ్చి నాచారంలో ఉంటుంది. భర్త విదేశాల్లో ఉంటున్నారని తెలిసింది. రోజు ఫోన్ చేసి వేధించేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. హేమంత్ వేధింపులు రోజు రోజుకు పెరిగాయట. ఆ టార్చర్ భరించలేక ఈ నెల 20వ తేదీన ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. ఫేస్బుక్ లైవ్ పెట్టి సూసైడ్ చేసుకుంది. ఆమె సూసైడ్ చేసుకునే సమయంలో లైవ్ వీడియో చూసినవారు కాపాడే ప్రయత్నం చేయలేదు. భర్త, లేదంటే ఇతరులు ఉన్నా సేవ్ చేయలేదు. లేదంటే సన బతికేవారు.
సనకు (sana) సంబంధించిన మరో వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తన కుమారుడితో కలిసి చక్కగా డ్యాన్స్ వేస్తోంది. అతను డ్రమ్ వాయిస్తే.. డ్యాన్స్ చేసింది. ఆ వీడియోలో తల్లి, కొడుకులు చక్కగా ఉన్నారు. అంతలోనే తిరిగిరానీ లోకాలకు వెళ్లిపోయంది. తన కుమారుడిని ఒంటరిని చేసింది. చనిపోయే ముందు కూడా తన కుమారుడిని హేమంత్‌కు ఇవ్వొద్దు అని చెప్పిందని సన కుటుంబ సభ్యులు అంటున్నారు.