ఉత్తరాఖండ్(uttarakhand )లోని పితోర్‌గఢ్(pithoragarh)లో ఘోర రోడ్డు ప్రమాదం(accident) జరిగింది. మున్సియారీ బ్లాక్‌లోని హోక్రాలో బొలెరో కారు ప్రమాదానికి గురై 500 మీటర్ల లోతున ఉన్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దీంతో స్థానిక గ్రామస్తులు ఆ ప్రాంతంలో పెద్దఎత్తున గుమిగూడారు. మృతులంతా బాగేశ్వర్ వాసులేనని చెబుతున్నారు. ప్రజలంతా బొలెరో కారులో గురువారం ఆలయ దర్శనానికి వెళ్తున్నారు. ఈ సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ఇటావా జిల్లాలోని చౌబియా పోలీస్ స్టేషన్ పరిధిలో మరో ప్రమాదం జరిగింది. ఇక్కడ ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై శ్రావస్తి నుంచి గుజరాత్‌కు కూలీలతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది. బస్సులో దాదాపు 80 మంది కూలీలు ఉన్నారని, ఇందులో 2 డజన్ల మందికి పైగా గాయపడ్డారని చెబుతున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సైఫాయి మెడికల్ కాలేజీకి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అయితే బస్సు డ్రైవర్ నిద్రమత్తులో ఉండడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.