»Murder Attempt To Gate Engineering College Secretary
Gate Engineering కాలేజీ సెక్రటరీపై హత్యాయత్నం, 12 మంది అరెస్ట్
గేట్ ఇంజినీరింగ్ కాలేజీ సెక్రటరీ కాంతారావుపై హత్యాయత్నం జరిగింది. కాలేజీ పార్ట్నర్స్ తనను చంపేందుకు సుఫారీ ఇచ్చారని కోదాడ పోలీసులకు కాంతారావు ఫిర్యాదు చేశారు.
Murder Attempt To Gate Engineering College Secretary
Gate Engineering: గేట్ ఇంజినీరింగ్ కాలేజీలో (Gate Engineering) పార్ట్నర్ల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇంజినీరింగ్ కాలేజీ, ఫార్మాసీ కాలేజీ సెక్రటరీ కాంతారావుపై (Kanta Rao) హత్యాయత్నం జరిగింది. ఈయన కాకతీయ ఎడ్యుకేషనల్ సొసైటీ, కిట్స్ ఇంజినీరింగ్ కాలేజీ మెంబర్ కూడా.. ఇటీవల పార్ట్నర్ల మధ్య విభేదాలు పొడచూపాయి. దాంతో అతనిని హత్య చేసేందుకు ప్రణాళిక రచించారు.
కారులో వస్తోండగా హత్య చేసే ప్రయత్నం చేశారు. సోమవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో కాంతారావు కారును డీసీఎం వ్యాన్ ఉద్దేశపూర్వకంగా ఢీ కొంది. ఆ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. తనను హత్య చేసేందుకు కొందరు ప్రయత్నించారని.. కోదాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. తర్వాత మరో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.
గేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓనర్‌పై హత్యాయత్నం
కాంతారావును హత్య చేసేందుకు సుపారీ ఇచ్చిన కాలేజ్ పార్టనర్స్. హత్య కోసం 50 లక్షలు ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్ తో ఒప్పందం. ముందుగా ఐదు లక్షలు చెల్లించిన గేట్ కాలేజీ భాగస్వాములు.
తనను హత్య చేసేందుకు రూ.50 లక్షలు ఇచ్చారని.. అడ్వాన్స్‌గా రూ.5 లక్షలు ఇచ్చారని కాంతారావు (Kanta Rao) అంటున్నారు. హత్య చేసే కుట్రలో ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉన్నారని తెలుస్తోంది. తనను మర్డర్ చేసేందుకు ప్రయత్నించిన 12 మందికి శిక్ష పడాలని కాంతారావు పోలీసులను కోరుతున్నారు.