కర్ణాటక(karanataka)లోని యాదగిరిగి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Accident) సంభవించింది. ఆగిఉన్న లారీని వేగంగా వచ్చిన జీపు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఏపీకి చెందిన ఐదురుగు మరణించారు. మరో 13 మందికి గాయాలయ్యాయి. మృతులు మునీర్, నయామత్, రమీజా బేగం, ముద్దత్ షీర్, సుమ్మి ఉన్నట్లు గుర్తించారు. అయితే వీరంతా నంద్యాల జిల్లా వెలగోడు మండలానికి చెందినవారని తెలుస్తోంది. బాధితులు కలబురిగిలోని దర్గా ఉరుసు జాతర(ursu jatar...
ఓ తల్లి తన నలుగురు పిల్లల్ని చంపడంతో ఆమెను సీరియల్ కిల్లర్‌గా కోర్టు ముద్ర వేసింది. అయితే 20 ఏళ్ల శిక్ష అనుభవించిన తర్వాత ఆమె తన పిల్లల్ని చంపలేదని నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ మహిళ జైలు నుంచి విడుదల కానుంది.
విద్యార్థులు, సెక్యూరిటీ సిబ్బంది ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో క్యాంపస్ మొత్తం రణరంగంగా మారిపోయింది. దీంతో కొందరు విద్యార్థులు ఈ విషయంలో పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఇరు వర్గాలను అడ్డుకున్నారు. ఈ కేసులో మొత్తం 33 మందిని అదుపులోకి తీసుకొని పోలీసు స్టేషన్‌కు తరలించారు.
ఈతకు వెళ్లిన నలుగురు మృతిచెందడంతో మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. ఘటనా స్థలి వద్ద కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
కారు ట్రక్కును ఢీకొనడం వల్ల ప్రమాదం(Car Accident) సంభవించినట్లు పోలీసులు నిర్దారించారు. ఈ ఘటనలో మలయాళీ నటుడు సుధి(Actor Sudhi) ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ముగ్గురు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కొల్లం సుధీ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్(CM Pinarai vijayan) సంతాపం తెలిపారు.
కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. దీంతో ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, మరో 20 మందికి గాయాలయ్యాయి. ఈ విషాదఘటన ఏపీలోని గుంటూరు జిల్లా(guntur district) వట్టిచెరుకూరులో జరిగింది. అయితే ప్రమాదం సమయంలో ట్రాక్టర్లో మొత్తం 40 మంది ప్రయాణిస్తున్నారు. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు.
మధ్యతరగతి కుటుంబాల ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. అనేక కుటుంబాల్లో ఉద్యోగం చేస్తే గానీ ఇల్లు గడిచే పరిస్థితి ఉండదు. ఒకవేళ అనుకోకుండా ఏదైనా కొనాలన్నా, తీసుకోవాలన్నా ఆకస్మాత్తుగా అప్పులు చేయాల్సిందే. అటువంటి పరిస్థితుల్లో తాజాగా ఓ ఫోన్ పొగొట్టుకున్న యువకుడు తండ్రిని మళ్లీ ఇబ్బందిపెట్టలేక బలవన్మరణం చేసుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ బోరబండ(borabanda)లో చోటుచేసుకుంది.
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా(Chandrapur district)లో ప్రయాణిస్తున్న కారు ఆదివారం సాయంత్రం ప్రమాదవశాత్తు వెళ్లి ప్రైవేట్ బస్సు(accident)ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, ఒక బాలిక తీవ్రంగా గాయపడింది. చంద్రపూర్ జిల్లా కేంద్రానికి సుమారు 115 కిలోమీటర్ల దూరంలో నాగ్‌భిడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాన్పా గ్రామంలో సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. నలుగురు అక్కడికక్కడే మరణించగా.....
తెలంగాణలో మరో వైద్య విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కేఎంసీ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య ఘటన మరువకముందే వరంగల్ జిల్లాకు చెందిన మరో వైద్యురాలు ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది.
కొండచరియలు విరిగి పడటంతో 19 మంది మృతిచెందిన ఘటన చైనాలో ఆదివారం చోటుచేసుకుంది. విరిగిపడ్డ కొండ చరియల ప్రాంతంలో 40 వేల మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారిని సురక్షితంగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు.
ఒడిశాలో రైలు ప్రమాద ఘటన(Odisha Train Accident) సిగ్నలింగ్ లోపం వల్లే జరిగినట్లు రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపింది. గూడ్స్ ట్రైన్‌లో ఇనుము ముడి పదార్థాలు ఉండడం వల్ల ప్రమాద తీవ్రత ఎక్కువైందని, అందుకే చాలా మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది.
కేంద్రం అందించే సాయానికి అదనంగా రాష్ట్రం నుంచి కూడా పరిహారం(Compensation) అందించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. రైలు ప్రమాద ఘటన(Odisha Train Accident)లో గాయాలపాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని తెలిపారు.
వేసవిలో చిన్నపిల్లలే టార్గెట్‌గా కుక్కల దాడులు జరుగుతున్నాయి. తాజాగా వీధి కుక్క ఓ బాలుడిపై దాడి(Dog Attack) చేసింది. ప్రస్తుతం ఆ బాలుడికి చికిత్స జరుగుతోంది.
రూ.500 కోసం కన్నతండ్రిని ఓ కొడుకు హత్య చేశాడు. కోపంతో ఊగిపోయిన నితీష్ ఆవేశంగా ఇంటికి వచ్చి తన డబ్బులు ఇవ్వాలని తండ్రిని అడిగాడు. సుబ్రమణ్యం డబ్బులు ఇవ్వనని చెప్పాడు. కొడుకును మందలించాడు. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఆ సమయంలోనే హత్య చేశాడు.
పెళ్లైన తర్వాత ఫస్ట్ నైట్ రోజే ఓ జంట విచిత్రమైన స్థితిలో చనిపోయారని వెలుగులోకి వచ్చింది. వారు ఊపిరాడక మరిణించారని పలువురు చెబుతుండగా..మరికొంత మంది హార్ట్ ఎటాక్ వచ్చినట్లు చెబుతున్నారు. ఈ విషాద ఘటన యూపీ(uttar pradesh)లో చోటుచేసుకుంది.